నటుడు వేణు భార్య గొప్పతనం తెలుసుకోవాల్సిందే..టాలీవుడ్ కే ఆదర్శం

Hero Venu Wife Anupama Chowdary Business,Hero Venu,anupama Chowdary, Swayam Varam, Chirunavvutho, Hanuman Junction, Venu Thottempudi,tollywood News

తెలుగు సినిమా పరిశ్రమలో ఆరడుగుల బుల్లెట్టు.వరుసగా 15 సినిమాలు హిట్టుమొత్తం 26 సినిమాలకు హీరో కామెడీ చేయాలన్నా, సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పాలన్నా, హీరోయిజం చూపించాలన్న హీరో వేణు తొట్టెంపూడికే సాధ్యం.

 Hero Venu Wife Anupama Chowdary Business,hero Venu,anupama Chowdary, Swayam Vara-TeluguStop.com

ఆయన కెరియర్లో ఎక్కువ శాతం హిట్లే ఉన్నాయి.స్వయం వరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే, ఖుషి ఖుషీగా గోపి గోపిక గోదావరి ఇలా ఈయన లైఫ్ లో ఎన్నో హిట్లు ఉన్నాయి.తొలి సినిమా ‘స్వయంవరం’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి “అబ్బా ఇతనెవరో బలే ఉన్నాడే అంటూ అందరిచేత అనిపించుకుని ఇండస్ట్రీలోకి దూసుకొచ్చి ఎంత స్పీడ్ గా సక్సెస్ చూసాడో అంతే స్పీడ్ గా కనుమరుగయ్యారు హీరో వేణు.

2006 తర్వాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న వేణు 2012లో జూనియర్ ఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘దమ్ము’ సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు.ఆ తర్వాత రామాచారి అనే సినిమా చేయగా అది పరాజయం పాలైంది.దాంతో ఇక సినిమాల వైపు చూడకుండా పూర్తి స్థాయిలో బిజినెస్ మీద ద్రుష్టి పెట్టారు.

ఈయన కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే అంటే 2001లో అనుపమ చౌదరి అనే అమ్మాయిని వేణు పెళ్లి చేసుకున్నాడు.అనుపమ బాగా చదవుకున్న అమ్మాయి.యూనివర్సిటీ అఫ్ మద్రాస్ లో ఎంబీఏ పూర్తిచేసింది.ఆ తర్వాత ఇంటీరియర్ డిజైనింగ్ లో ట్రైనింగ్ కూడా తీసుకుంది.

వేణుతో పెళ్లి అయిపోయిన తర్వాత హైద్రాబాద్ కి షిఫ్ట్ అయినా అనుపమ 10 ఏళ్లుగా సొంతంగా బిజినెస్ నడుపుతుంది.

Telugu Chirunavvutho, Hanuman, Venu, Swayam Varam-Latest News - Telugu

స్క్రాప్ బుక్ బిజినెస్ స్టార్ట్ చేసి అందులో మంచి అనుభవం సంపాదించడమే కాకుండ దేశ విదేశాల్లో ఎంతోమంది కస్టమర్లను ఆకట్టుకొని బిజినెస్ ను విజయవంతంగా నడిపిస్తోంది.ప్రెసెంట్ స్క్రాప్ బుక్ బిజినెస్ లో అనుపమనే నెంబర్ వన్.అసలు ఈ స్క్రాప్ బుకింగ్ అంటే దళసరి పేపర్లతో చేసే ఒకరకమైన ఆర్ట్.ఏదైనా పెళ్లిళ్లకు, పిల్లల పుట్టిన రోజులకో ఏదైనా ఫంక్షన్స్ కో గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఈ స్క్రాప్ బుక్ ఆల్బమ్ రూపంలో ఇస్తూ ఉంటారు.ఈరోజుల్లో తక్కువ ఖర్చులో చాలా గ్రాండ్ గా ఉంటుందని ఎక్కువమంది ఈ స్క్రాబ్ బుక్ మీద ద్రుష్టి పెడుతున్నారు.

ఇంకా ఈమే మంచి పెయింటర్ కూడా ఈమె వేసిన పెయింటింగ్స్ అన్ని కలిపి అప్పుడప్పుడు ఎక్సబిషన్ కూడా నిర్వహిస్తుంది.ఇంకా మన వేణు గారి సినిమాల్లో ఆడవాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అలాగే రియల్ లైఫ్ లో కూడా వేణు తన భార్యకి ఫుల్ గా సపోర్ట్ చేస్తారట.

ఆమె వెన్నంటే ఉండి ఆమెని ముందుకు నడిపిస్తాడట.ఏదిఏమైనా వేణు లాంటి భర్త దొరకడం అనుపమ చేసుకున్న అదృష్టం అయితే అనుపమ లాంటి అర్ధం చేస్కునే భార్య దొరకడం కూడా వేణుకి ప్లస్ అనే చెప్పాలి.

Telugu Chirunavvutho, Hanuman, Venu, Swayam Varam-Latest News - Telugu

ఇంకా వేణు గారికి తెలంగాణాలో పొలిటికల్ గా కూడా మంచి సపోర్ట్ వుంది.2019లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ప్రచారం చేశాడు.ఆయన బావ నామా నాగేశ్వరరావు గారు కూడా ప్రస్తుతం టీఆర్ఎస్ తరపున ఖమ్మం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.సో, అలాంటి బాక్రౌండ్ వున్న వేణు  ముందు ముందు జగపతిబాబు గారిలాగా మంచి మంచి క్యారెక్టర్స్ తో మల్లి రీ ఎంట్రీ ఇస్తే బావుంటుంది.

మరి చూద్దాం ఆయనకు సరిపడా క్యారెక్టర్స్ తో ఏ డైరెక్టర్స్ అయినా ముందుకు వస్తారేమో! అదండీ వేణుగారి గురుంచి ఆయన వ్యక్తిగత విషయాల గురించి సమాచారం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube