సీటీమార్ కొట్టేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న గోపీచంద్

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సీటీమార్’ గతంలోనే రిలీజ్‌కు రెడీ అయ్యింది.కానీ ఈ సినిమాను దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

 Gopichand Seetimaarr Release Date Locked, Gopichand, Seetimaarr, Tamannaah, Samp-TeluguStop.com

అయితే ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ ఆట కోచ్‌గా కనిపిస్తుండటం, ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు ఈ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి.కాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర యూనిట్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.

సీటీమార్ చిత్రాన్ని సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.

ఇక ఈ సినిమాతో గోపీచంద్ సాలిడ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని గట్టిగా చూస్తున్నాడు.ఈ సినిమాను పక్కా కమర్షియల్ అంశాలతో పూర్తి ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు సంపత్ నంది తీర్చిదిద్దాడు.

కాగా ఈ సినిమాలో గోపీచంద్ సరసన అందాల భామ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది.కాగా ఓ కీలక పాత్రలో దిగంగనా సూర్వవంశీ కూడా నటిస్తోంది.

ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీన్స్‌లో గోపీచంద్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు.

సంపత్ నంది తెరకెక్కి్స్తున్న ఈ సినిమాలో తమన్నా ‘జ్వాలా రెడ్డి’ అనే పాత్రలో నటిస్తోంది.

ఈ పాత్ర తమన్నా కెరీర్‌లో బెస్ట్ పాత్రగా ఆమెకు కలిసొస్తుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు.అయితే ఈ సినిమాను దసరా కంటే ముందే రిలీజ్ చేసి సక్సెస్ కొటటాలని చిత్ర యూనిట్ వేసిన ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు అభిమానులు.

ఏదేమైనా సీటీమార్ కొట్టేందుకు గోపీచంద్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube