కొంత మంది నటులు.పుట్టుకతోనే నటులుగా పుడతారు.
వారు నటిస్తుంటే ఏ కోశాన నటించినట్లు కనిపించరు.సహజంగా ఉంటుంది.
నిత్యజీవితంలో మనం ఎలా ఉన్నామో… వెండి తెరమీద వాళ్లు అలాగే ఉన్నారు అనిపిస్తుంది.నటన అనేది సహజంగా ఉండాలి.
అనేది వారిని చూస్తేనే తెలుస్తుంది.అలాంటి నటీమణులు తెలుగులో చాలా మంది ఉన్నారు.
నాటి భానుమతి నుంచి నేటి సాయి పల్లవి వరకు ఇలాంటి కోవకు చెందిన వారే.తమ హావభావాలతో జనాలను ఆకట్టుకుంటున్నారు ఈ నటీమణులు.
వారితో పాటు తెలుగులో సహజ నటిగా గుర్తింపు పొందిన తార జయసుధ.తెలుగులో సహజన నటి అనగానే ఠక్కున జయసుధే గుర్తుకు వస్తుంది.మహానటి సావిత్రి తర్వాత.అంతటి స్థాయిలో ఫ్యామిలీ రోల్స్ ద్వారా జనాలకు దగ్గరయ్యింది.
ఆరోజుల్లో జయప్రద, శ్రీదేవి అందచందాలతో కుర్రకారులో సెగలు పుట్టించారు.జయసుధ మాత్రం కేవలం తన చూపులతోనే వాళ్లకు గట్టి పోటీ ఇచ్చింది.
మిగతా వారితో పోల్చితే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందింది.జయసుధ కెరీర్ తొలినాళ్లలో ఆమెను గ్లామరస్ గా చూపించేందుకు దర్శకులు చాలా ఇబ్బంది పడేవారట.
ఆమెను కమర్షియల్ గా చూపించేందుకు సమ్మతించేవారు కాదట.ఆరోజుల్లోనే తను బికినీ వేసి కుర్రకారుకు ఆమెలోని గ్లామర్ ను చూపించినా.
చాలా మంది తనను ఫ్యామిలీ హీరోయిన్ గా ఆదరించారట.అంతేకాదు.
తను గ్లామరస్ గా కనిపించిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయట.అందుకే తనను గ్లామరస్ హీరోయిన్ గా చూపించేందుకు దర్శకులు వెనుకడుగు వేసేవారట.

అందరి మాట ఎలా ఉన్నా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాత్రమే జయసుధను గ్లామరస్ హీరోయిన్ గా చూపించాడట.అందుకే కమర్షియల్ సినిమాలను ఎక్కువగా రాఘవేంద్రరావుతోనే చేసేదట జయసుధ.ఇప్పటికీ జయసుధ. తల్లిగా, నాన్నమ్మగా జనాలను అలరిస్తూనే ఉంది.వాస్తవానికి జయసుధ అసలు పేరు సుజాత.తన చిన్నతనం అంతా చెన్నైలోనే గడిచింది.విజయ నిర్మలకు స్వయానా పిన్ని అయిన జయసుధ.అనుకోకుండా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.అటు రాజకీయాల్లోకి కూడా అనుకోకుండా చేరి శాసనసభ్యురాలిగా ఎన్నిక అయ్యింది.