ప్రపంచంలో ఎన్నో కోట్ల జీవరాశులు భూమిపై జీవిస్తుంటాయి.వాటిలో చేపలు కూడా ఒకటి.
చేపల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి.కొన్ని అరుదైన జాతుల చేపలను ఎక్కడ పడితే అక్కడ కనిపించవు.
కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అవి పెరుగుతాయి.అలాంటి చేపల గురించి ఇపుడు మనం తెలుసుకుందాం.
కలుగ
: ప్రపంచంలో తాజా నీటిలో తిరిగే చేపల్లో ఇది పెద్దది.ఇవి ఏకంగా 5.6 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి.రష్యా, చైనా నదుల్లో ఎక్కువగా కనిపిస్తాయి.

ఫ్లయింగ్ గర్నార్డ్ :
అట్లాంటిక్ సముద్రంలో ఈ చేపలు పెరుగుతాయి. ముళ్ళతో కూడిన రెక్కల వంటి నిర్మాణాలు వీటి ప్రత్యేకత.

సీ రాబిన్స్ :
వీటికి ఇతర జీవులకు ఉన్నట్లుగా ఆరు కాళ్ళు ఉంటాయి.నీలి రంగు బోర్డర్ తో నలుపు రంగులో మొప్పలు ఉంటాయి.ఇవి డ్రమ్ ను పోలిన శబ్దలను చేస్తాయి.

చైమామన్-లెదర్ జాకెట్ :
చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి.కానీ వీటిని తక్కువ అంచనా వేయకూడదు.వీటికి పదునైన దంతాలు ఉంటాయి.
వాటితో ఆక్టోపస్ లను పెద్ద చేపలను కూడా గాయపరచగలవు.
ఫ్లాబీ వేల్ ఫిష్ : ఇవి ఎరుపు రంగులో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. సముద్ర గర్భంలో జీవిస్తాయి.వీటిలో మగ చేపలు కేవలం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మాత్రమే ఆహారం తీసుకుంటాయి.
