కూల్ డ్రింక్స్ లో ఎందుకు హానికరం ? ఏముంటాయి వాటిలో?

కూల్ డ్రింక్స్ తాగకూడదు అని మనకు తెలియక కాదు, కూల్ డ్రింక్స్ శరీరానికి ఎలాంటి మేలు చేయవని అర్థం కాక కాదు, మరి ఎందుకు కూల్ డ్రింక్స్ తాగుతున్నారు అంటే మాత్రం సరైన సమాధానం రాదు.సరే, కూల్ డ్రింక్స్ హానికరమైనవి అని మనకు తెలుసు.

 These Are Few Hazardous Chemicals In Cool Drinks-TeluguStop.com

కాని ఎందుకో తెలుసా? తెలియకపోతే ఇది చదవండి.

* కూల్ డ్రింక్స్ లో ఉండే ఫాస్పోరిక్ ఆసిడ్ మీ శరీరంలో కాల్షియంని పీల్చివేస్తుంది.

దీంతో ఎముకలు బలహీనపడతాయి.దంతాలు కూడా బలహీనపడతాయి.

* కూల్ డ్రింక్స్ లో వాడే అస్పెర్టేమ్ అనే కెమికల్ బ్రేయిన్ ట్యూమర్స్ కి కారణం కావచ్చు అని పరిశోధనలు చెబుతున్నయి.

* కార్సీనోజెన్ కెమికల్ వలన క్యాన్సర్ కారకం అవుతుంది కూల్ డ్రింక్.

* చాలా సింపుల్.కూల్ డ్రింక్స్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి.

ఇవి ఇన్సూలిన్ లెవెల్స్ ని పెంచేస్తాయి.డయాబెటిస్, గుండె జబ్బు, కొలెస్టరాల్ సమస్యలు .అన్నిటీకి కారణమవుతాయి కూల్ డ్రింక్స్ లో ఉండే హై షుగర్ లెవెల్స్.

* కెఫైన్ ఓ మాదిరిగా తీసుకుంటేనే మంచిది.

అందుకే కాఫిని సైతం లిమిటెడ్ గా తాగండి అంటూ హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.మరి కూల్ డ్రింక్స్ లో ఎంత కెఫైన్ ఉంటుందో తెలుసా? 750 మిల్లీలీటర్ల బాటిల్ లో 70 మిల్లిగ్రాములు.దీంతో నిద్రలేమి సమస్యలు రావచ్చు.హార్ట్ బీట్ రేట్ ఓ ట్రాక్ లో ఉండకపోవచ్చు.

* కూల్ డ్రింక్స్ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ని కూడా పెంచుతాయి.హై కెఫైన్ శాతం మీకు పుట్టబోయే బిడ్డపై కూడా చెడు ప్రభావం చూపించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube