నా లక్ష్యం పేదరిక నిర్మూలన, నా నడక నేలమీదే , నా ప్రయాణం సామాన్యులతోనే అంటూ చెప్పుకొచ్చారు వైఎస్ జగన్…( YS Jagan ) బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు( Governor Speech ) తెలిపే తీర్మానం పై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు…గడచిన నాలుగేళ్లలో వారి ప్రభుత్వం చేసిన అభివృద్ది కార్యక్రమాలు , అమలు చేసిన సంక్షేమ పథకాలు( Social Welfare Schemes ) గణాంకాలతో సహా చెప్పుకొచ్చారు…
అధికారం లోకి వచ్చిన 45 నెలల్లో దాదాపు 98.5% హామీలు నెరవేర్చామని ,మరే ఇతర రాజకీయ పార్టీ కూడా ఈ విధం గా మానిఫెస్టో కి కట్టుబడి అంకితభావం తో పని చేసిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు….

తనకు ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ముఖ్యమో నెల నెల పెన్షన్ తీసుకునే అవ్వా తాతలు కూడా అంతే ముఖ్యమని , ఐటీ ఎంత ముఖ్యమో చిరువ్యాపారులు కూడా అంతే ముఖ్యమని,పరిశ్రమలు ఎంత ముఖ్యమో వ్యవసాయం కూడా అంటే ముఖ్యమని చెప్పారు…ఇదే నా ఎకనామిక్స్ ,నా పాలిటిక్స్ ,నా తండ్రి నుంచి నేను నేర్చుకున్న హిస్టరీ అని చెప్పుకొచ్చారు…
ముందు ముందు కూడా ఇదే స్పూర్తి తో మానిఫెస్టో లో ఇచ్చిన హామీలతో పాటు మానిఫెస్టో లో చెప్పని పనులు కూడా చేస్తూ ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ది పథం లో నడిపిస్తానని
స్పష్టం చేశారు….

అయితే ఈ ప్రసంగం పై ఒక వైపు వైసీపీ మద్దతుదారులు ,జగన్ అభిమానులు ప్రభుత్వ పనితీరు కు అద్దం పట్టేట్టు సీఎం జగన్ మాట్లాడారని,ఆయన చెప్పిందే చేస్తారు చేసిందే చెప్తారు అని హర్షం వ్యక్తం చేస్తుంటే మరో వైపు మరికొంత మంది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం లో చెయ్యని గొప్పలు చెప్పుకుంటూ జబ్బలు చరుచుకోడం సరైన పని కాదంటూ ,ఎన్నికలకు ఇంకా సమయం వుండగానే అప్పుడే సీఎం ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారంటూ ఎద్దేవా చేస్తున్నారు….
ఏది ఏమైనా రాష్ట్ర ప్రజల సమస్యలు తెలుసుకుని తీర్చే మహత్తర ఉద్దేశం తో రాష్ట్ర ప్రజాధనం తో ఏర్పాటు చేసుకునీ, నిర్వహించుకునే ఈ అసెంబ్లీ సమావేశాలు తమ మూలకారణం మరిచి అనవసర విషయాలపై విలువైన సమయాన్ని వృథా చేసుకునే పద్దతికి స్వస్తి చెప్పి ఉపయోగకరమైన విషయాలపై చర్చలు జరగాలని కోరుకుందాం….