తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగిందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు.24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తి అయిందన్న అక్బరుద్దీన్ ఓవైసీ గతంలో పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ఉండేవని చెప్పారు.తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందని తెలిపారు.
అలాగే పరిశ్రమలు, వ్యవసాయానికి రాష్ట్రంలో 24 గంటల కరెంట్ వస్తోందని వెల్లడించారు.కాంగ్రెస్ చెప్పిన విధంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వంలో పాతబస్తీలో రూ.25 వేల కోట్ల అభివృద్ధి జరిగిందని చెప్పారు.ప్రజాప్రతినిధిగా సమస్యలను ప్రస్తావించడం తన బాధ్యతని తెలిపారు.