అక్కినేని నట వారసుడిగా అక్కినేని అఖిల్( Akkineni Akhil ) కి ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.ఈయన ‘మనం ‘ సినిమాలో అతిథి పాత్రలో అలా మెరవగానే రెండు తెలుగు రాష్ట్రాలు షేక్ అయ్యాయి.
ఇతని స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది, భవిష్యత్తులో సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్ కి కచ్చితంగా వెళ్తాడని అందరూ అనుకున్నారు.కానీ అఖిల్ ఇండస్ట్రీ లోకి హీరోగా అడుగుపెట్టిన ముహూర్తం అసలు ఏమాత్రం బాగాలేదు అనుకుంట.
అందుకే ఇండస్ట్రీ కి వచ్చి 8 ఏళ్ళు పూర్తి అవుతున్నా కూడా ఇప్పటి వరకు కెరీర్ లో సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు.ఇక ఎన్నో భారీ అంచనాల నడుమ ఈ ఏడాది విడుదలైన ‘ఏజెంట్’( agent ) చిత్రం కూడా డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో అఖిల్ కెరీర్ డైలమా లో పడింది.
ఇప్పుడు ఆయనకి అర్జంటుగా హిట్ రావడం అత్యవసరం.

ఇది ఇలా ఉండగా అఖిల్ తన చిన్నతనం లోనే బాలనటుడిగా ‘సిసింద్రీ’( Sisindri ) అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన సంగతి అందరికీ తెలిసిందే.ఈ చిత్రం దోగాడుతూ, అఖిల్ చేసిన అల్లరి కి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.ఆరోజుల్లోనే ఈ సినిమా 5 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది.
అయితే ఈ సినిమా తర్వాత అఖిల్ మళ్ళీ బాలనటుడిగా నటించలేదు, నేడు ‘అఖిల్’ సినిమా ద్వారానే ఇండస్ట్రీ లోకి హీరో గా ఎంట్రీ ఇచ్చాడని అందరూ అనుకుంటున్నారు.కానీ ఆయన బాల్యం లో ఉన్నప్పుడే మరో సినిమాలో కూడా నటించే ఛాన్స్ దక్కింది.
ఆ సినిమా పేరే ‘సంతోషం’( santhosham ).అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) హీరో గా నటించిన ఈ సినిమా 2002 వ సంవత్సరం లో విడుదలై అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది.

ఈ చిత్రం లో నాగార్జున కొడుకుగా అక్షయ్ బచ్చు నటించాడు.అయితే ఈ పాత్రకి ముందుగా అక్కినేని అఖిల్ ని తీసుకుందామని అన్నాడట డైరెక్టర్ దశరధ్( Director Dasharath ).వాడిని ఇప్పటి నుండే కెమెరా ముందుకు తీసుకొని రావడం నాకు ఇష్టం లేదు, సిసింద్రీ అంటే ఒక పెద్ద ఆబ్లిగేషన్ వల్ల చేయించాల్సి వచ్చింది అని అన్నాడట.ఈ పాత్రకి అఖిల్ సరిగ్గా సరిపోతాడని, అతనిని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా, తక్కువ రోజుల్లోనే అఖిల్ పాత్రని పూర్తి చేస్తానని నాగార్జున కి మాట ఇచ్చాడట డైరెక్టర్ దశరధ్.
అంతలా రిక్వెస్ట్ చేసాడు కాబట్టి నాగార్జున కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.ఒక వారం రోజులు షూటింగ్ చేసాక, అఖిల్ కి తీవ్రమైన జ్వరం వచ్చిందట.ఒక రెండు రోజుల్లో తగ్గిపోతుంది అనుకుంటే, వారం దాటినా కూడా జ్వరం తగ్గలేదట.దేనితో అఖిల్ ని తప్పించి అక్షయ్ బచ్చు తో తీసారట.
ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.