మన దేశంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరమవుతున్న వాళ్లు లక్షల్లో ఉన్నారు.ఆడపిల్లలకు చదువు విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
ప్రకాశం జిల్లా పామూరు( Pamuru of Prakasam district ) మండలం గమ్మలం పాడుకు చెందిన గంధం రోజమ్మ సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందేనని చెప్పవచ్చు.రోజమ్మ తల్లి సుశీల, తండ్రి ఇసాక్ ఇద్దరూకూలి పనులు చేసేవారు.
రోజమ్మ ఇంటర్ లో చేరాక కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి.
అదే సమయంలో రోజమ్మ( rojamma ) తల్లి కూడా అనారోగ్యం పాలయ్యారు.
ఆ సమయంలో రోజమ్మ కాలేజ్ కు కూడా సరిగ్గా వెళ్లేవారు కాదు.ఇంట్లో ఆర్థిక కష్టాలు తీరడానికి రోజమ్మ కూలి పనికి వెళ్లేవారు.
ఆదివారం పూట పిల్లలకు ట్యూషన్లు కూడా చెప్పేవారు.ఆస్పత్రిలో నగల దుకాణంలో హెల్పర్ గా పని చేయడంతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మూడు సబ్జెక్ట్ లు ఫెయిల్ అయ్యారు.
ఆ తర్వాత రోజమ్మ మూడేళ్లు కూలి పనులకు పరిమితమయ్యారు.
ఆ తర్వాత తెలుగు శాఖ అధ్యక్షులు శ్రీపురం యజ్ఞశేఖర్( Sripuram Yajnasekhar ) రోజమ్మ ఇంటర్ పూర్తి చేసేలా సహాయ సహకారాలు అందించారు.
ఆ తర్వాత రోజమ్మ చెన్నైలోని క్యూన్ మేరీస్ కాలేజ్ లో బీఏ తెలుగులో చేరారు.అయితే ఆ సమయంలో కూడా రోజమ్మ సేల్స్ గర్ల్ గా సాయంత్రం పని చేస్తూ ఉదయం కాలేజ్ కు వెల్లి చదువుకున్నారు.
బీఏ తెలుగులో బంగారు పతకం సాధించిన రోజమ్మ సీఎం స్టాలిన్ చేతుల మీదుగా ఆ పతకాన్ని అందుకున్నారు.

తాజాగా ఎం.ఏ తెలుగులో 80 శాతం మార్కులతో బంగారు పతకాన్ని సాధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( President Draupadi Murmu ) చేతుల మీదుగా ఆ పతకాన్ని అందుకున్నారు.తన సక్సెస్ గురించి రోజమ్మ మాట్లాడుతూ ఎన్నో కష్టాలను అధిగమిస్తే ఈ పతకాలు దక్కాయని ఆమె పేర్కొన్నారు.
నాలా చదువుకునే ఆడపిల్లలకు స్పూర్తిగా నిలవాలని అనుకుంటున్నానని రోజమ్మ కామెంట్లు చేశారు.తెలుగులో పీహెచ్డీ చేసి ప్రొఫెసర్ కావాలని నేను అనుకుంటునన్నానని ఆమె చెప్పుకొచ్చారు.







