ప్రముఖ తమిళ దర్శకుడు ఎస్.శంకర్ భారతీయుడు-2 అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో తమిళ విలక్షణ నటుడు కమలహాసన్ నటిస్తున్నాడు.అయితే హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
అయితే ఇటీవల కాలంలో ఈ చిత్ర షూటింగ్ జరగుతుండగా క్రేన్ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.అయితే ఈ ప్రమాదంలో ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు మరియు ఒక లైట్ మెన్ అక్కడికక్కడే మృతి చెందగా కాజల్ అగర్వాల్, కమలహాసన్ దర్శకుడు శంకర్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
అయితే తాజాగా ఈ విషయంపై ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నశంకర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు.ఇందులో భాగంగా తాను దర్శకత్వం వహిస్తున్నటువంటి చిత్రం షూటింగ్ సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడం తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు.
అంతేకాక ఈ ప్రమాదం జరిగినప్పటినుంచి ఈ సంఘటనను తలుచుకుని రోజూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నానని అన్నారు.అంతేగాక ఈ ప్రమాదం ఏదో నాకు జరిగిన బాగుండేదని అనవసరంగా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు.
అంతేగాక చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా సినీ పరిశ్రమలోని కొందరు పెద్దలు దర్శకుడు శంకర్ నిర్లక్ష్యం లోపం కారణంగానే ప్రమాదం జరిగిందంటూ శంకర్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.దీంతో నెటిజన్లు దర్శకుడు శంకర్ కి మద్దతుగా నిలుస్తున్నారు.ప్రమాదాలు అనేవి జరుగుతాయని ముందే తెలిస్తే ఎవరు మాత్రం ఆపకుండా ఉంటారని, అలాగే అనుకోకుండా జరిగినటువంటి ప్రమాదానికి ఒక్కడిని బాద్యుడు చేసిన అతడి పై తీ విమర్శలు చేయడం సరికాదని అంటున్నారు.
అయితే ఈ విషయంపై స్పందించిన టువంటి కమలహాసన్ కూడా మృతుల కుటుంబాలకు ఆర్థిక పరంగా కొంత సహాయం అందించాలనే ఉద్దేశంతో కోటి రూపాయల ప్రకటించిన సంగతి తెలిసిందే.అంతే కాక సినీ పరిశ్రమలోని మరికొంత మంది ప్రజలు ముందుకు వచ్చి తమ సహాయాన్ని అందించాలని కూడా కోరారు.