టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్లను తీసి సినీ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసినటువంటి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “రామ్ గోపాల్ వర్మ” గురించి టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ సినిమా పరిశ్రమలో కూడా తెలియనివారు ఉండరు.అయితే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం తనకు ఇష్టం వచ్చినట్లు తన లైఫ్ ని లీడ్ చేయడం కేవలం రామ్ గోపాల్ వర్మకి మాత్రమే సాధ్యం అవుతోంది.
ఎందుకంటే జీవితంలో బంధాలు, బంధుత్వాలు, కమిట్ మెంట్లు వంటి వాటిని రామ్ గోపాల్ వర్మ పెద్దగా పట్టించుకోడు.అందువల్లనే చాలా హ్యాపీగా తనకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తుంటాడు.
దీంతో ఇప్పటికే చాలామంది రామ్ గోపాల్ వర్మ మాదిరిగా కనీసం ఒక్కరోజయినా బ్రతకాలని ఉందంటూ పలువురు యంగ్ డైరెక్టర్లు, హీరోలు తమ మనసులో మాటను బయట పెట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.కాగా తాజాగా రామ్ గోపాల్ వర్మ తెలుగులో నూతన దర్శకుడు “బాలరాజు.ఎం” దర్శకత్వం వహించిన “కనబడుటలేదు” చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.ఈవెంట్ కి రామ్ గోపాల్ వర్మతో పాటు టాలీవుడ్ ప్రముఖ సినీ రచయిత “విజయేంద్ర ప్రసాద్” మరియు మరింత మంది చిత్రయూనిట్ సభ్యులు హాజరయ్యారు.

అయితే ఈ ఈవెంట్ లో భాగంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ గడ్డం పై పలు పంచులు పేల్చాడు.అంతే కాకుండా తాను అంత బారుగా గడ్డం పెంచడానికి ఇన్స్పిరేషన్ నరేంద్ర మోడీ నా లేక రవీంద్రనాథ్ ఠాగూర్ నా అంటూ సరదాగా అందరినీ నవ్వించాడు.ఇక ఈ చిత్రంలో నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతూ తాను ఈ చిత్రంలో ఎక్కువగా హీరోయిన్ “వైశాలి రాజ్” ను మాత్రమే చూశానని ఈ అమ్మడు తన పాత్రకి చాలా బాగా న్యాయం చేసిందని కితాబిచ్చాడు.అంతేకాకుండా తాను చిన్నప్పటి నుంచి కేవలం హీరోయిన్ల కోసం మాత్రమే సినిమాలు చూస్తానని అలాగే అప్పట్లో ప్రముఖ స్వర్గీయ నటి శ్రీదేవి హీరోయిన్ గా నటించిన పదహారేళ్ళ వయసు చిత్రాన్ని శ్రీదేవి కోసం 16 సార్లు చూశానని 17వ సారి మాత్రమే చంద్రమౌళిని చూసినట్లు చెప్పుకొచ్చాడు.
అనంతరం యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా “కనబడుటలేదు” చిత్రం ఈ నెల 13వ తారీఖున సినిమా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.
మరి కనబడుటలేదు చిత్రం సినీ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.