ఈ మధ్య కాలంలో కొందరు అక్రమ దారులలో డబ్బులు సంపాదించాలని ప్రయత్నాలు చేస్తూ కటకటాల పాలవుతున్నారు.కాగా తాజాగా ఓ హీరోయిన్ ఇంట్లో భారీ మొత్తంలో మత్తు మందు పదార్థాలు మరియు ఇతర మద్యం నిల్వలు దొరికిన ఘటన బంగ్లాదేశ్ దేశంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే పలు చిత్రాలలో మరియు ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బంగ్లాదేశీ నటి “పోరి మోని” దేశ రాజధాని ఢాకాలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.అయితే ఇటీవలే ఉన్నట్లుండి వింగ్ డైరెక్టర్ కమాండర్ అల్ మెయిన్ నటి పోరి మోని ఇంటిపై మెరుపు దాడి చేసి సోదాలు నిర్వహించారు.
అయితే ఈ సోదాల్లో భాగంగా ప్రభుత్వ అధికారులు భారీ మొత్తంలో మత్తు మందు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఇటీవలే పోలీసులు తెలిపారు.దీంతో నటి పోరి మోని ని అరెస్టు చేసి రిమాండ్ కి తరలిస్తున్నట్లు తెలిపారు.
దీంతో ప్రస్తుతం ఈ విషయం బంగ్లాదేశ్ సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

దీంతో కొందరు నటి పోరి మోని బంధువులు, సన్నిహితులు ఈ విషయంపై స్పందిస్తూ కొందరు కావాలని పోరి మోని కి సంబంధం లేని కేసులో ఇరికిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా వారం రోజుల క్రితం నటి పోరి మోని బంగ్లాదేశ్ దేశానికి చెందినటువంటి ఓ ప్రముఖ వ్యాపార వేత్త తనను లైంగికంగా వేధిస్తున్నాడని అంతేకాకుండా అత్యాచారయత్నం కూడా చేశాడని సంచలన వ్యాఖ్యలు చేసింది.ఈ సంఘటన జరిగిన తరువాత పోరి మోని ఇంటిపై సోదాలు జరగడం మత్తు మందు పదార్థాలు దొరకడం వంటివి చూస్తుంటే కొందరు కావాలనే నటి పోరి మోని ని ఈ కేసులో ఎదురుచూస్తున్నట్లు అభిమానులు వాపోతున్నారు.
అంతేగాక తమ అభిమాన హీరోయిన్ పోరి మోని కి న్యాయం చెయ్యాలంటూ పలు చోట్ల నిరసనలు చేపట్టారు.