తెలుగులో ఆర్ఎక్స్ 100 మూవీ ఫేమ్ హీరో “కార్తికేయ గుమ్మకొండ” మరియు నూతన దర్శకుడు “అర్జున్ జంధ్యాల” కాంబినేషన్లో తెరకెక్కిన “గుణ 369” చిత్రం సినీ ప్రేక్షకులకి బాగానే గుర్తుంటుంది.అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ మ్యూజికల్ పరంగా మాత్రం మంచి హిట్ అయ్యింది.
అయితే ఈ చిత్రంలో కార్తికేయ గుమ్మకొండ కి జోడిగా అనఘా నటించగా ప్రముఖ దర్శకుడు ఆదిత్య మీనన్, మహేష్ ఆచంట, కౌముది, హేమ, మంజు భార్గవి, నరేష్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.కాగా ఇటీవలే ఈ చిత్రం విడుదలై రెండు సంవత్సరాలు పూర్తయింది.
దీంతో ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో నటించిన నటుడు మహేష్ ఆచంట ప్రేక్షకులతో పంచుకున్నాడు.అయితే ఇందులో భాగంగా దర్శకుడు అర్జున్ జంధ్యాల మహేష్ ని సిక్స్ ప్యాక్ బాడీ పెంచమని కావాలంటే తనకోసం ఆరు నెలల పాటూ చిత్రాన్ని వాయిదా వేస్తానని కూడా చెప్పాడట.
కానీ మహేష్ ఆచంట మాత్రం సిక్స్ ప్యాక్ బాడీ పెంచడం తన వల్ల కాదని చెప్పడంతో చిత్ర యూనిట్ సభ్యులు యధావిధిగా సినిమా షూటింగ్ ను పూర్తి చేశారని తెలిపాడు.అంతేకాక ఈ చిత్రంలో తన పాత్ర చూసి చాలామంది తిట్టుకున్నప్పటికీ నటన పరంగా తనకు మంచి గుర్తింపు తెచ్చిందని దీనికితోడు దర్శకుడు కూడా తన పాత్రని చాలా డిఫరెంట్ గా తెరకెక్కించాడని తెలిపాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా నటుడు మహేష్ ఆచంట సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో జబర్దస్త్ కార్యక్రమంలో కొంత కాలం పాటు కమెడియన్ గా పని చేశాడు.ఆ తర్వాత పలు చిత్రాలలో కమెడియన్ గా నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు లభించలేదు.కానీ రంగస్థలం, మహానటి, గుణ 369 తదితర చిత్రాలలో నటించడంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.కాగా ప్రస్తుతం మహేష్ ఆచంట దాదాపుగా ఐదు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తూ బాగానే రాణిస్తున్నాడు.