పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) తో కలిసి సాహో ( Sahoo ) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమయ్యారు బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్.ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శ్రద్ధ కపూర్ కి తాజాగా ఒక నేటిజన్ ప్రపోజ్ చేస్తూ తనని ఆశ్చర్యపరిచారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సినిమా సెలబ్రిటీలు అంటే ఎంతో మంది అభిమానులు ఉంటారు.ఈ క్రమంలోనే వారితో కలిసి ఒక ఫోటో అయినా దిగాలని చాలామంది భావిస్తూ ఉంటారు అయితే అలా సెలబ్రిటీలు ఎక్కడైనా బయట కనపడితే వారితో ఫోటోలు దిగడం వారికి ప్రపోజ్ చేయడం లాంటివి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి.ఈ క్రమంలోనే శ్రద్ధ కపూర్ కి వీరాభిమాని అయినటువంటి ఓ వ్యక్తి ఏకంగా ఎర్ర గులాబీలతో ఉన్నటువంటి ఫ్లవర్ బొకే తన చేతిలో పెట్టి తనకు మోకాళ్లపై కూర్చుని ప్రపోజ్ చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
తాజాగా ముంబై ఎయిర్పోర్టులో శ్రద్ధ కపూర్ సందడి చేయడంతో ఆమె అభిమాని ఆమెను చూసి ఎంతో సంతోషపడ్డారో అయితే ఏం చేయాలో దిక్కు తెలియక ఫ్లవర్ బొకే తీసుకొని మోకాలపై కూర్చొని తనకు ప్రపోజ్ చేయడంతో ఆమె కూడా తనపై అభిమాని చూపిస్తున్నటువంటి ప్రేమకు ఫిదా అయ్యారు.అనంతరం తనతో కలిసి షేక్ హ్యాండ్ తీసుకొని ఫోటోలకు ఫోజులిచ్చారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ప్రస్తుతం కెరియర్ పరంగా శ్రద్ధ కపూర్( Shraddha Kapoor ) పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.