ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు పెళ్లి రోజు కావడంతో పలువురు సెలిబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడుకి మరియు అయన సతీమణి భువనేశ్వరి దంపతులకి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో భాగంగా టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ కూడా తన పెద్దమ్మ, పెదనాన్న లకి పెళ్లిరోజు శుభాకాంక్షలు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశాడు.
అంతేగాక నారా చంద్రబాబు నాయుడు మరియు నందమూరి భువనేశ్వరి ల పెళ్లి రోజు ఫోటోలను షేర్ చేశాడు.దీంతో తెలుగు తమ్ముళ్లు ఈ ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ బాగానే వైరల్ చేస్తున్నారు.
అంతేగాక పెద్ద ఎత్తున నారా చంద్రబాబు నాయుడు కి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే నారా చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బాబు కూడా తన అమ్మానాన్నలకు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పెళ్లి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నారా రోహిత్ తెలుగు, మలయాళం, తమిళం భాషలలో కలిపి దాదాపుగా నాలుగు చిత్రాలలో నటిస్తున్నాడు.అంతేగాక టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న “పుష్ప” చిత్రంలో కూడా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను నారా రోహిత్ నటిస్తున్నట్లు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పటి వరకూ ఈ వార్తలపైపుష్ప చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో నారా రోహిత్ పుష్ప చిత్రంలో నటిస్తున్నట్లు వస్తున్నటువంటి వార్తలలో నిజమెంత అనేది ఇంకా తెలియాల్సి ఉంది.