ప్రస్తుతం కన్నడ సినీ పరిశ్రమలో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో తెలుగు హీరోయిన్ సంజన గల్రాని అరెస్టయిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో పోలీసులు ఆమెని ప్రత్యేక సెల్ లో ఉంచి ఇటీవలే విచారించగా తాను మత్తు మందు పదార్థాలను తీసుకోలేదని పోలీసులకు తెలిపింది.
దీంతో పోలీసులు ఆమె రక్త నమూనాలను సేకరించి నిజానిజాలను రాబట్టేందుకు ప్రయత్నించగా సంజన గల్రాని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతేగాక సినీ పరిశ్రమలోని కొందరు పెద్దలు కావాలనే తనని ఈ కేసులో ఇరికిస్తున్నారని వాపోయింది.
అయితే పోలీసులు మాత్రం నటి సంజన గల్రాని చెప్పిన మాటలని నమ్మడం లేదు. అంతేగాక తాను మత్తు పదార్థాలను తీసుకున్నది లేనిది రక్త నమూనా పరీక్షల ద్వారా నిరూపితం చేస్తామని కాబట్టి ఈ రక్త నమూనా లను తీసుకునేందుకు సహకరించాలని కోరుతున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇదే కేసులో అరెస్ట్ అయినటువంటి రాగిణి ద్వివేది కూడా పోలీసులకు విచారణలో సహకరించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో రాగిణి ద్వివేది ని మరింత కాలం పాటు పోలీసులు రిమాండులో ఉంచి విచారించాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఏదేమైనప్పటికీ ఎంతో మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఇద్దరు హీరోయిన్లు ఇలా మత్తు పదార్థాల సరఫరా మరియు వినియోగం కేసులు చిక్కుకోవడం చాలా బాధాకరమని ఈ హీరోయిన్ల అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ప్రస్తుతం ఈ ఇద్దరూ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రాల భవిష్యత్తు కూడా ప్రశార్థకంగా మారింది.