మానవుడు భోజనం చేసేటప్పుడు సరికొత్త అనుభూతులను రుచి చూడాలని తహతహలాడుతున్నాడు.వీరి కోరికలకు తగినట్లుగానే హోటల్స్, రెస్టారెంట్ వెరైటీ సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నాయి.
సోషల్ మీడియా పుణ్యమా అని ఇలాంటి చిత్ర విచిత్రమైన సర్వీస్‌లు అప్పుడప్పుడు వెళ్లి లోకి వస్తున్నాయి.తాజాగా మరొక విభిన్నమైన సర్వీస్ కి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో పాపులర్ అయింది.
ఈ వీడియో విచిత్రమైన డైనింగ్ ఎక్స్‌పీరియన్స్( Strange Dinning Experience )ను చూపుతుంది.ఈ ఫుటేజీలో పర్వతాల మధ్యలో ఉన్న ఒక లోతైన లోయపై ఒక కేబుల్‌ను కట్టడం చూడవచ్చు.
ఆ కేబుల్ కు డిన్నర్ టేబుల్‌ను, కుర్చీలను కట్టారు.ఒక జంట వాటి మీద వద్ద కూర్చున్నట్లు మనం గమనించవచ్చు.
ఈ సెట్టింగ్ ఫోటో షూట్ కోసం ఏర్పాటు చేశారు.
మహిళ తెల్లటి దుస్తులు ధరించగా, నల్లటి సూట్‌లో మగ వ్యక్తి కనిపించాడు.ఇద్దరూ చాలా ఫార్మల్‌గా కనిపిస్తారు.లోయ పైన కట్టిన ఒక కేబుల్ కు డైనింగ్ టేబుల్( Dinning Table ) అటాచ్ చేయగా ఈ జంట దానిపై కూర్చొని తాడు ద్వారా మధ్యలోకి వెళ్లారు.
టేబుల్ అంచుపై నుంచి దూరంగా నెట్టినప్పుడు పురుషుడు బాగా భయపడిపోయాడు కింద పడతానేమోనని కేబుల్ ని గట్టిగా పట్టుకోవడం మనం చూడవచ్చు, అయితే మహిళ తన చేతులను టేబుల్‌కి అడ్డంగా చాచి, దానిపై స్థిరంగా ఉంటుంది.ఈ సాహసోపేతమైన డిన్నర్ ప్లేస్ ఎక్కడుందో చెప్పలేదు.
అయితే వీడియోలో ఒక మహిళ రష్యన్ భాష మాట్లాడుతున్నట్లు నేపథ్యంలో వినవచ్చు, బహుశా ఈ డిన్నర్ ప్లేస్ రష్యా( Russia )లో ఉండి ఉండొచ్చు.
ఈ వీడియో మార్చి నెలలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.దీనికి 1.5 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి.దీనికి “సెనా రొమాంటికా” అని పేరు పెట్టారు, అంటే స్పానిష్‌లో “రొమాంటిక్ డిన్నర్”( Romantic Dinner ) అని అర్థం.లోయ మధ్యలో సస్పెండ్ అయిన జంట కోసం ఎలాంటి భద్రతా చర్యలు లేకపోవడంపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు.
జంట లేదా వారిని సెటప్ చేసే వ్యక్తికి బెల్టులు లేదా పట్టీలు వంటి ఏ విధమైన భద్రతా పరికరాలు ఉన్నట్లు కనిపించడం లేదని వారు పేర్కొన్నారు.ఫోటోల కోసం ఇటువంటి విపరీతమైన చర్యలు చేయడం చాలా పిచ్చితనం అని మరి కొందరు ఫైర్ అయ్యారు.