కరోనా వచ్చి దాదాపు ఆరు నెలలు పూర్తి అవుతున్న శాస్త్రవేత్తలు కరోనా గుట్టును బయట పెట్టలేకపోతున్నారు.కరోనాపై ప్రస్తుతం ప్రపంచంలోని శాస్త్రవేత్తలు అందరూ రకరకాలు పరిశోధన చేస్తున్నారు.
దానివల్లే కరోనా వైరస్ కు సంబంధించి రోజుకొక ఆసక్తికర అంశం బయటికి వస్తుంది.తాజాగా శాస్త్రవేత్తలు మనుషులు పెద్దగా అరవడం వల్ల కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుందని తేల్చారు.
మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
కరోనా వైరస్ ఉన్న వ్యక్తి మాట్లాడేటప్పుడు బయటకు వచ్చే నోటితుంపర్లు ద్వారా వైరస్ పెద్ద ఏరోసోల్ కణాలను వదిలివేస్తుందని.
దీనివల్ల గట్టిగా మాట్లాడేప్పుడు విడుదలయ్యే డెసిబెల్స్ వల్ల ఈ ఏరోసోల్ ప్రభావం యాభై రేట్లు పెరుగుతుందని దీనివల్ల ఆ ప్రాంతంలో ఉండేవారికి ఈ వైరస్ వ్యాప్తి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని అదే మనుషులు నెమ్మదిగా మాట్లాడుకుంటే ఈ ఏరోసోల్ ప్రభావం అంత తీవ్రంగా ఉండదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
కరోనా వైరస్ ప్రపంచానికి పరిచయం అయి ఆరు నెలలు అవుతున్నా దీన్ని నివారించలేకపోతున్నా మన అసమర్థతను సరిచేసుకోవాలని కొందరు సూచిస్తుంటే కరోనా అధ్యాయం ముగియకముందే ఇలాంటి వైరస్ లు ఫ్యూచర్ లో చాలా వస్తాయని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసింది.
ఇదంతా చూస్తున్న జనాలు ముందు ఈ ఉపద్రవం దాటనివ్వండి తర్వాత మీకు నచ్చినట్లు మీకు కావాల్సిన వాళ్ళని విమర్శించుకోండి అని అంటున్నారు.