ఈ టర్మరిక్ సీరంను రోజు వాడితే క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం!

క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.అందుకోసం ఖరీదైన ఫేస్ క్రీమ్, మాయిశ్చరైజర్ వంటివి వాడుతుంటారు.

 Use This Turmeric Serum Daily For Clear And Glowing Skin! Turmeric Serum, Clear-TeluguStop.com

అయితే మార్కెట్లో లభ్యమయ్యే ఎన్ని ఉత్పత్తులను వాడిన సరే అటువంటి స్కిన్ ను పొందడం చాలా మందికి అసాధ్యంగా మారుతుంది.కానీ ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ టర్మరిక్ సీరంను కనుక వాడితే సహజంగానే క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను తమ సొంతం చేసుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ టర్మరిక్ సీరం ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్ ను వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు గ్లిజరిన్ వేసి స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్లు కోకోనట్ ఆయిల్ వేసుకుని మరోసారి మిక్స్ చేసుకోవాలి.

చివరగా రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, ఆరు టేబుల్ స్పూన్లు రోజ్‌ వాటర్ వేసుకుని అన్నీ కలిసేంతవరకు మిక్స్ చేసుకుంటే మన హోమ్ మేడ్ టర్మరిక్ సీరం సిద్దం అవుతుంది.ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ముఖానికి ఉన్న మేకప్ ను తొలగించి వాటర్ తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.

అనంతరం తయారు చేసి పెట్టుకున్న హోమ్ మేడ్ టర్మరిక్ సీరంను అప్లై చేసుకుని నిద్రించాలి.ప్రతిరోజు ఈ సీరంను వాడితే కనుక ముఖంపై ఎలాంటి మచ్చలు మొటిమలు ఉన్న దూరం అవుతాయి.క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

అలాగే చర్మం గ్లోయింగ్ సైతం మెరుస్తుంది.ఈ టర్మరిక్ సీరంను వాడటం వల్ల చర్మం టైట్ గా మారుతుంది.

ముడతలు ఏమైనా ఉన్నా సరే క్రమంగా మాయం అవుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube