త్వరలో లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) రానున్న నేపథ్యంలో తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై హస్తం పార్టీ తీవ్ర కసరత్తు చేస్తుంది.ఈ క్రమంలో ఖమ్మం పార్లమెంట్ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది.
ఖమ్మం స్థానం నుంచి తనకే టికెట్ ఇవ్వాలని పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు( V.Hanumantha Rao ) అంటున్నారు.లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగాలనే యోచనతోనే రాజ్యసభ టికెట్ అడగలేదన్నారు.
కుటుంబ రాజకీయాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రోత్సహించరని అభిప్రాయం వ్యక్తం చేశారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఖమ్మం టికెట్ తనకే ఇస్తారని వీహెచ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.