సినిమా వాళ్ళకి బంధాలు, బంధుత్వాలు ఉండవని సినిమానే వాళ్ళకి ప్రపంచం అని అంటూ ఉంటారు చాలామంది.అయితే కొంతమందికి సినిమాల్లో నటించడం అలవాటు అయిపోయి నిజ జీవితంలో కూడా నటిస్తూ ఉంటారు.
అలాగే కొంతమంది మాత్రం చాలా సున్నిత మనస్తత్వంతో, ఉదారత భావంతో ఉంటారు.అలాగే చిన్న చిన్న విషయాలను కూడా భూత అద్దంతో పెద్దదిగా చూస్తూ ఉంటారు.
ఇలా ప్రవర్తించడం వలన మంచితో పాటు ఒక్కసారి చెడు కూడా ఎదురవుతూ ఉంటుంది.ఇక తెలుగులో ఒకానొక స్టార్ కమెడియన్ అయిన రాజబాబు విషయంలో కూడా ఇలాంటి ఒక చిత్రమైన సంఘటన జరిగింది.
ఈయనది రాజమండ్రి.రాజబాబు సోదరులైన చిట్టిబాబు, అనంత బాబు ఇద్దరూ కూడా హాస్యనటులే.వాళ్లు కూడా సినిమా రంగంలోనే కొనసాగుతున్నారు.రాజబాబు పెద్దకొడుకు అవ్వడంతో కుటుంబ భారం మోసే అందుకు టీచర్ ట్రైనింగ్ తీసుకుని టీచర్ గా పని చేసేవాడు.టీచర్ గా పని చేస్తున్న కూడా సినిమాపై ఉన్న ఆసక్తి ఏ మాత్రం తగ్గలేదు.అంతకుముందే రాజబాబు నాటకాలు కూడా వేసేవాడు ఆ నాటకాలు వేసే అనుభవంతో సినిమాల్లో నటించడానికి మద్రాసు వెళ్ళాడు.
బాబుకి మొదటగా సమాజం అనే సినిమాలో మొదటి అవకాశం వచ్చింది.రాజబాబు కేవలం 20 ఏళ్ల కాలంలోనే ఆనాడే 600 చిత్రాల దాకా నటించాడు.
ముందు నుంచి స్వతహాగా ఒకరిని అనుకరించే లక్షణం ఉండడం, అలాగే మిమిక్రీ కూడా రావడంతో అందరినీ నవ్విస్తూ తను కూడా నవ్వుతూ ఉండేవాడు.ఇలా ఎన్నో సినిమాల్లో హాస్యనటుడిగా నటించి అందరినీ నవ్వించాడు కమెడియన్ గా ఒక మంచి స్టేజ్లో జీవితం కొనసాగుతున్న సమయంలో బాబు అండ్ బాబు అనే సినిమా నిర్మాణ సంస్థను స్థాపించి ఎవరికీ వారే యమునా తీరే, మనిషి రోడ్డున పడ్డాడు వంటి చిత్రాలను స్వయంగా నిర్మించి బాగా ఆర్థికంగా దెబ్బ తిన్నాడు.1983, ఫిబ్రవరి 7 న అనారోగ్యంతో రాజబాబు చనిపోయాడు.అయితే ఆయన చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు కారణంగానే చనిపోయాడనే వార్త అవాస్తవం.
ఆయన దానాలు చేసి సినిమాలు నిర్మించి, నష్టపోయినా కూడా కుటుంబానికి కావలసిన డబ్బును మాత్రం సమకూర్చాడు.
![Telugu Anantha Babu, Chitti Babu, Raja Babu, Rajababu-Telugu Stop Exclusive Top Telugu Anantha Babu, Chitti Babu, Raja Babu, Rajababu-Telugu Stop Exclusive Top]( https://telugustop.com/wp-content/uploads/2021/02/entire-his-lifetollywoodrajababu.chitti-bab.jpg)
రాజబాబు ఒకటే సిద్ధాంతాన్ని నమ్మేవాడు.మనం ఎవరికన్నా సహాయం చేస్తే అందులో కనీసం ఒక్కరు అయినాగానీ మనస్ఫూర్తిగా మనల్ని బావుండాలి అని ఆశీర్వదించిన అవి ఫలిస్తాయి అని రాజబాబు నమ్మేవాడు .ఆయన కెరీర్లో తొలినాళ్లలో నటించేటప్పుడు స్టూడియోలో పనిచేసే ఒక లైట్ బాయి కిందకు వచ్చి.సార్ నా జీవితంలో ఎందరో నటులను నటీమణులను చూశాను.
నేను గొప్పవారు అవుతారు అని చెప్పిన అందరు స్టార్స్ గా ఎదిగారు.మీలో కూడా ఆ ప్రతిభ ఉంది.
మీరు ఏదో ఒక నాడు ఈ సినీ సామ్రాజ్యాన్ని ఏలతారు అని ఆశీర్వదించారట అలాగే మీరు మంచి స్థితిలో ఉంటే నన్ను గుర్తు పెట్టుకోండి అని అన్నాడట.అయితే రాజబాబు ఆ లైట్ బాయ్ ఆశీర్వదించినట్లే ఒక పెద్ద స్థాయికి ఎదిగాడు.
కానీ ఆయనని ఆనాడు ఆశీర్వదించిన లైట్ మాన్ గురించి ఎక్కడ ఆరా తీసినా గాని కనిపించలేదు. అప్పట్లో ప్రతి స్టూడియోలోను కొన్ని వేలసంఖ్యలో శాశ్వతంగా పని చేసే లైట్ బాయిలు ఉండేవాళ్ళు.
కొన్నాళ్ల తర్వాత తనను ఆశీర్వదించిన వ్యక్తి ఎవరో అన్నది రాజబాబు గుర్తించలేదు.అలాగే ఆ వ్యక్తి కూడా తనను ఆశీర్వదించిన వ్యక్తిని నేనే అని కూడా రాజబాబు ముందుకు రాలేదు.
దాంతో అతను ఎక్కడున్నాడు ? ఉంటే.అసలు బతికి ఉన్నాడో లేదో తెలియని పరిస్థితి.
![Telugu Anantha Babu, Chitti Babu, Raja Babu, Rajababu-Telugu Stop Exclusive Top Telugu Anantha Babu, Chitti Babu, Raja Babu, Rajababu-Telugu Stop Exclusive Top](https://telugustop.com/wp-content/uploads/2021/02/chitti-babu-anand-babu-lite-man-raja-babu.jpg )
రాజబాబు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాడు.నాడు మద్రాసులో, హైదరాబాదులో ఉన్న స్టూడియోలలో ఉన్నలైట్ మెన్స్ అందరిని ఒక్కో దీపావళి పండగ రోజున ఒక్కో స్టూడియో ఎంచుకుని ఇందులో పనిచేసే అందరికీ బట్టలు పంచేవారు.అలాగే దానాలు కూడా చేసేవారు.అలా ఆనాడు అన్నీ స్టూడియోలలోనున్న అందరి లైట్ బాయ్ లకు దీపావళి రోజున ప్రత్యేక వంటలతో భోజనాలు, బట్టలు, ఇతర దానాలు చేసేవాడు.
అయితే సినిమాలో వచ్చిన మొదట్లో రాజబాబు ని ఆశీర్వదించిన లైట్ బాయ్ వీరందరిలో ఎక్కడో ఒకచోట ఉంటాడు అనే నమ్మకంతో ఉన్నాడు రాజబాబు.ఆ నమ్మకంతోనే ప్రతి యేటా లైట్ బాయ్స్ అందరికి ఇలా దానాలు చేసేవాడట.
కానీ రాజబాబు మాత్రం చివరి నిమిషం దాక ఆ లైట్ మాన్ గురించి ఆలోచిస్తూనే ఉండేవాడటతనని ఆశీర్వదించిన వ్యక్తిని చూడాలని ఇంతలా తపన పడడం చూస్తుంటేనే అర్ధం అవుతుంది కదా రాజబాబు మనస్తత్వం
.