ఇప్పటికి ఆ లోటు అలాగే ఉండిపోయింది: కమెడియన్ అలీ

యమలీల.కమెడియన్ గా కొనసాగుతున్న అలీని హీరోగా పెట్టి పెద్ద ప్రయోగం చేశాడు ఫ్యామిలీ సినిమాల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి.1994లో విడుదలై తెలుగు సినిమా పరిశ్రమలో సంచనల విజయం సాధించింది.ఆ ఏడాది చిన్న సినిమాగా విడుదల అయిన ఈ సినిమా.

 Comedian Ali About Yamaleela Movie, Ali, Comedian Ali, Director Sv Krishna Reddy-TeluguStop.com

అత్యధిక కలెక్షన్ సాధించింది.మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు జనాల నుంచి అనుకోని రీతిలో ఆదరణ దక్కింది.

తొలుత అలీ హీరోగా ఈ సినిమాను ఎస్వీ కృష్ణారెడ్డి ప్రకటించినప్పుడు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడారు.అలీ లాంటి కమెడియన్ ను పెట్టి సినిమా తీస్తే ఎవరు చూస్తారు? అనే మాటలు వినిపించాయి.యమలీల విజయంతో వారి నోళ్లన్నీ ఆటోమేటిక్ గా మూత పడేలా చేశాడు దర్శకుడు.

ఈ సినిమా సంచలన విజయం సాధించినా.

ఆ ఏడాది ప్రకటించిన నంది అవార్డుల్లో అంతగా ప్రాధాన్యత దక్కలేదు.ఏదో ఇవ్వలేదు అన్నట్లుగా ఒకే ఒక్క అవార్డును అందించారు.

అది కూడా బెస్ట్ కొరియోగ్రాఫర్ గా సుచిత్రకు ఈ అవార్డు వచ్చింది.అన్ని విభాగాల్లో అద్భుతంగా తెరకెక్కిన ఈ సినిమాకు ముష్టి వేసినట్లు ఒక్క అవార్డు ఇవ్వడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి.

అలీ ఇప్పటికీ ఈ విషయంలో కోపంగానే కనిపిస్తాడు.నిజానికి ఈ సినిమాకు అన్ని విభాగాల్లో అవార్డులు అందుకునే సత్తా ఉంది.

బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ స్ర్కీన్ ప్లే, బెస్ట్ డైరెక్షన్.ఒకటేమిటీ అన్నింటిలోనూ చక్కటి మంచి ప్రతిభ ఉన్నా.

ఎందుకో అవార్డుల కమిటీ మాత్రం వీటిని లెక్కలోకి తీసుకోలేదు.

Telugu Ali Career, Music Award, Ali, Indraja, Tollywood, Yamaleela-Telugu Stop E

అటు ఇంద్రజ కూడా ఈ సినిమాకు అవార్డులు రాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది.ఈ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ అవార్డు తప్పకుండా రావాలన్నారు.ఈ సినిమాలోని నీ జీనూ ప్యాంటు చూసి బుల్లెమ్మో, సిరులొలికించే చిన్నిన‌వ్వులే, జుంబారే జూజుంబ‌రే అనే పాటలు అప్పట్లో ఎంతో ఫేమస్ అయ్యాయి.

అయినా ఈ పాటలకు తగిన గుర్తింపు రాకపోవడం ఆశ్చర్యకరం.జనాల నుంచి ఎంతో ఆదరణ వచ్చింది.అవార్డులు వస్తే ఎంత? రాకుంటే ఎంత? అన్నాడు ఓ సారి దర్శకుడు కృష్ణారెడ్డి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube