ఓటర్లకు స్పెషల్ ఆహ్వాన పత్రిక పంచుతున్న కలెక్టర్.. వైరల్..

ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో అధికారులు ప్రజలను ఓటు హక్కును వినియోగించాలని వివిధ రకాలుగా ప్రచారం చేస్తున్నారు అనేకమంది.ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు ఓటర్లకు చైతన్యం కలిగించే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

 Collector Distributing Special Invitation Letter To Voters , Collector, Viral Ne-TeluguStop.com

ఇకపోతే తాజాగా తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా( Bhavesh Mishra ) కాస్త వెరైటీగా ‘భారత ప్రజాస్వామ్య పండుగ లోక్సభ సాధారణ ఎన్నికలు 2024‘ పేరిట ఓ ఆహ్వాన పత్రికను ముద్రించి వాటిని ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతోంది.

ఓటర్లను చైతన్య పరచడమే అంశంగా పెట్టుకున్న ఆయన కొత్త వరవడిని సృష్టించారు.ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఓట్ల పండుగకు మీ కుటుంబంలోని అర్హులందరూ ఓట్లు వేసేందుకు సాధారణంగా ఆహ్వానిస్తున్నట్లు ఆయన ముద్రించిన ఆహ్వాన పత్రికలో తెలిపారు.వీటితో పాటు ఈ వేడుకకు హాజరై ఫలాలను అందుకోవాలని ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలంటూ ఆయన ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.

అయితే ఇలా చేయడానికి కారణం లేకపోలేదు.

మే 13న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పోలింగ్ లో పాల్గొని ప్రజలు వారి ఎంపీలను ఎన్నుకోవాలంటూ సూచించాడు. పోలింగ్ స్టేషన్లో( polling station ) నిర్వహించే ఓటింగ్ ప్రక్రియకు ప్రజలు హాజరైతే ప్రభుత్వం అందించే ఫలాలను అందుకోవచ్చని ఆయన చెప్పుకొచ్చారు.అలాగే ఓట్ల పండుగకు వచ్చే ప్రతి ఒక్కరు ఓటు వినియోగించేందుకు తప్పనిసరిగా ఫోటో గుర్తింపు కార్డును తీసుకొచ్చుకోవాలంటూ కోరారు.

ఇలా ఓ కొత్త ట్రెండ్ తో జిల్లా కలెక్టర్ ఆహ్వాన పత్రికతో ఓటర్లలో చైతన్యం నింపే ప్రయత్నం చేపట్టారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కర పత్రం సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube