YS Jagan : ‘సిద్ధం’ సభతో దద్దరిల్లిన ‘రాయలసీమ’.. నీరుగారిపోయిన విపక్షాలు

అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ పార్టీ నిర్వహించిన ‘సిద్ధం’ సభ( Siddham Meeting ) విజయవంతం అయింది.సభకు అశేవ జనవాహిని తరలిరావడంతో సముద్రాన్ని తలపించిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

 Cm Ys Jagan Counter To Pawan Kalyan Chandrababu Naidu At Siddham Meeting-TeluguStop.com

కనివిని ఎరుగని రీతిలో సిద్ధం సభ జరిగింది.సీఎం వైఎస్ జగన్ పుట్టిన గడ్డ రాయలసీమ నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు.

ఊహించిన దానికంటే భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో .సిద్ధం సభ నిర్వహించిన ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది.రాయలసీమతో సీఎం వైఎస్ జగన్( CM YS Jagan ) కు ఎంతో అనుబంధం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ కు అక్కడి ప్రజలు ఎంతగా నీరాజనాలు పడతారనే దానికి రాప్తాడు సభ ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు.

భూమి -ఆకాశం ఏకం అయ్యాయా అనిపించే విధంగా ఎటు చూసినా జనమే కనిపించారు.

-Latest News - Telugu

వైఎస్ జగన్ మాటలకు, ఆయన విసిరే పంచ్ డైలాగులకు ప్రజలు ఉర్రూతలు ఊగారు.కార్యకర్తలు, అభిమానులు విజిల్స్ కొట్టేలా వైఎస్ జగన్ విపక్ష పార్టీలపై ధ్వజమెత్తారు.సైకిల్( Cycle ) ఎప్పుడూ బయటే ఉండాలి, టీ గ్లాసు సింకులోనే ఉండాంటూ పొలిటికల్ పంచులు వేశారు.

గతంలోని టీడీపీ పాలనతో పాటు ఆ పార్టీ అధినేత చంద్రబాబు( TDP Chandrababu Naidu ) వ్యక్తిత్వాన్ని సైతం వైఎస్ జగన్ కడిగి పారేశారు.ప్రజలను ఏ విధంగా వంచిస్తారు.

మాయమాటలతో నమ్మించి గెలిచిన తరువాత చంద్రబాబు ఎలా మాట మారుస్తారనేది ఉదాహారణలతో సహా జగన్ ప్రజలకు వివరించారు.సిద్ధం సభల్లో జగన్ చేసిన ప్రసంగాలు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి.

పార్టీ నేతలు, కార్యకర్తలను యుద్ధానికి సన్నద్ధం చేస్తూ జగన్ ప్రసంగాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు.దీంతో వారు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు.

-Latest News - Telugu

మరోవైపు వైఎస్ జగన్ కు వస్తున్న ఆదరణను చూసి ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు( Opposition Parties ) ఓర్వలేకపోతున్నాయి.ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ చరిత్రలోనే ఇలాంటి సభను నిర్వహించలేదన్న సంగతి అందరికి తెలిసిందే.

జగన్ కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక దాన్ని తక్కువ చేసి చూపించాలని టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని తెలుస్తోంది.ఇందులో భాగంగా జగన్ సభకు జనం రాలేదని, భయపెట్టి జన సమీకరణ చేశారని చెబుతూ ప్రజలను నమ్మించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయట.

-Latest News - Telugu

కానీ అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడి కాంతిని ఏ విధంగా ఆపలేమో.అదే తరహాలో సీఎం వైఎస్ జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను అడ్డుకోవడం కూడా అసాధ్యమని వైసీపీ శ్రేణులు( YCP Leaders ) చెబుతున్నాయి.ఈ క్రమంలోనే రాష్ట్రంలోని విపక్ష పార్టీ నేతలు ఎంత తాపత్రయపడినా పార్టీని కానీ పార్టీ విజయాన్ని కానీ నిలువరించలేరని జగనన్న సైనికులు ఘంటాపథంగా చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube