తెలంగాణ అసెంబ్లీ వేదికగా కేంద్రంపై సీఎల్పీ నేత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లుపై ఆయన మాట్లాడారు.
విద్యుత్ పై రాష్ట్రాలకు పూర్తి హక్కు ఉండాలని తెలిపారు.విద్యుత్ అనేది ఉమ్మడి జాబితాలో అంశంమన్న భట్టి.
కేంద్రం తమ విధానాలను రాష్ట్రాలపై బలవంతంగా రుద్దుతోందని మండిపడ్డారు.
ఎక్కడో ఉత్పత్తి చేసిన విద్యుత్ ను కొనుగోలు చేయాలనడం సమంజసం కాదన్నారు.
దేశ సంపదను వారి సొంత ఆస్తిలా కేంద్రం అమ్ముతోందని భట్టి విమర్శించారు.విద్యుత్తుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు.
ఈ క్రమంలో లెక్కలన్నీ చూస్తే రైతులకు ఇచ్చేది అరకొరేనని పేర్కొన్నారు.డబుల్ ఇంజిన్ లేకపోతే రాష్ట్రానికి నిధులు ఇవ్వరా అని ప్రశ్నించారు.