జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కలిశారు.ఈ మేరకు హైదరాబాద్ లో ఆయన పవన్ తో భేటీ అయ్యారు.
అయితే ఇంఛార్జ్ ల మార్పులు చేర్పుల్లో భాగంగా చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా విజయానంద రెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే.దీనిపై సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
తాజాగా ఆయన జనసేనాని పవన్ తో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.దీంతో ఎమ్మెల్యే ఆరణి త్వరలో జనసేన పార్టీలోకి చేరే అవకాశం ఉందని ప్రచారం జోరందుకుంది.