టాలీవుడ్ సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కూడా ఉన్నారు.వీరు ఇప్పటికి సోలో హీరోలుగా చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.
ఈ వయసులో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వరుస షెడ్యూల్స్ తో బిజీగా గడుపు తున్నారు.వీరిద్దరూ మంచి స్నేహితులు కూడా.
అయితే ఈ స్నేహితులు ఇద్దరు కూడా ఈసారి బాక్సాఫీస్ ఫైట్ చేయబోతున్నారు.
వీరిద్దరూ నటించిన సినిమాలు ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి.
చిరంజీవి గాడ్ ఫాథర్ సినిమాతో రాబోతుంటే.నాగార్జున ది ఘోస్ట్ సినిమాతో రాబోతున్నారు.
ఇద్దరు అక్టోబర్ 5న దసరా పండుగ సందర్భంగా బరిలోకి దిగబోతున్నారు.ఇద్దరు కూడా సినిమా రిలీజ్ డేట్లు ప్రకటించుకుని ఎవరికీ వారు సంసిద్ధం అవుతున్నారు.
చూస్తుంటే ఇద్దరు బరిలోకి దిగడానికి వెనకడుగు వేయడానికి ఇష్టపడడం లేదు.
చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ చేస్తున్నాడు.ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో చిరు గాడ్ ఫాదర్ గా కనిపిస్తాడు.
పొలిటికల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఇక అక్కినేని నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాతో మరొక హిట్ ను తన ఖాతాలో వేసుకుని అదే జోష్ లో ది ఘోస్ట్ సినిమా పూర్తి చేసాడు.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా సాలిడ్ యాక్షన్ డ్రామా అని ఇప్పటికే వచ్చిన ప్రొమోషనల్ కంటెంట్ ద్వారా తెలుస్తుంది.మరి రెండు సినిమాలు ఏమాత్రం తగ్గకుండా రిలీజ్ కు సిద్ధం అవుతున్నాయి.మరి చివరి వరకు ఈ పోటీ ఉంటుందా? లేదంటే స్నేహితులు ఒకరి కోసం ఒకరు ఎవరైనా తగ్గుతారా? అనేది చూడాలి.