టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కృతిశెట్టికి ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాల విజయాలతో ప్రస్తుతం కృతిశెట్టి పేరు మారుమ్రోగుతోంది.
ది వారియర్, మాచర్ల నియోజకవర్గం సినిమాలు ఫ్లాపైనా ఆ ప్రభావం ఇప్పటికైతే కృతిశెట్టి కెరీర్ పై పెద్దగా పడలేదు.తాజాగా ప్రసారమైన సూపర్స్ గ్రాండ్ ఫినాలే కృతిశెట్టి గెస్ట్ గా హాజరయ్యారు.
ఆ సమయంలో సుడిగాలి సుధీర్ ఇక్కడ పెళ్లికాని వాళ్లు ఇద్దరే ఉన్నారని ఒకరు కృతిశెట్టి కాగా మరొకరు నేను అని సుధీర్ చెప్పుకొచ్చారు.కృతిశెట్టికి లైన్ వేస్తున్నావా అని అనసూయ అడగగా సుధీర్ సిగ్గు పడుతూ ఆ ప్రశ్నకు లేదని సమాధానం ఇచ్చాడు.
ఆ తర్వాత అనసూయ కృతిశెట్టికి ఎలాంటి భర్త కావాలో తెలుసుకుంటే బాగుంటుందని సుధీర్ కు సూచించగా కృతి శెట్టి తనకు కాబోయే భర్తలో ఉండాల్సిన లక్షణాల గురించి చెప్పుకొచ్చారు.
దయా హృదయం కలిగిన వ్యక్తి తనకు భర్తగా కావాలని తనకు కాబోయే భర్త పాజిటివ్ ఆటిట్యూడ్ ను కలిగి ఉండాలని ఆమె చెప్పుకొచ్చారు.
నన్ను బాగా చూసుకోవడంతో పాటు సపోర్టివ్ గా ఉండాలని ఆమె కామెంట్లు చేశారు.ఆ తర్వాత కృతిశెట్టి చబ్బీగా ఉండే వ్యక్తిని నేను భర్తగా కోరుకుంటున్నానని ఆన్నారు.
సుడిగాలి సుధీర్ వెంటనే నేను చబ్బీనే అని కావాలంటే పొట్ట చూడాలంటూ కామెంట్ చేశారు.

కొంతసేపటి క్రితం సిక్స్ ప్యాక్ అని చెప్పావ్ కదా అంటూ కృతిశెట్టి ప్రశ్నించగా సిక్స్ ప్యాక్ ఉన్నవాళ్లు కూడా చబ్బీగా ఉండవచ్చని సుధీర్ అన్నారు.సుధీర్ కృతిశెట్టిని పెళ్లి చేసుకోవాలంటూ ఇంప్రెస్ చేయడం ప్రేక్షకులకు నవ్వు తెప్పించింది.ప్రస్తుతం సుధీర్ అన్ని ఛానెళ్లలోని ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.







