బుక్ మై షోకు మాదాపూర్ పోలీసులు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.అనుమతి లేకుండా సన్ బర్న్ ఈవెంట్ టికెట్స్ విక్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల కేసు నేపథ్యంలో బుక్ మై షో వెనక్కి తగ్గింది.ఈ క్రమంలో సన్ బర్న్ ఈవెంట్ టికెట్ విక్రయాలను బుక్ మై షో నిలిపివేసింది.
అయితే పర్మిషన్ లేకపోయినా టికెట్లు ఎలా విక్రయిస్తారంటూ బుక్ మై షోపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.అలాగే బుక్ మై షో నిర్వాహకులతో పాటు సన్ బర్న్ నిర్వాహకులకు సైతం పోలీసులు నోటీసులు జారీ చేశారు.
దీంతో వెనక్కి తగ్గిన బుక్ మై షో టికెట్ల విక్రయాలను నిలిపివేసింది.