కరోనా మహమ్మారి, ప్రతికూల వాతావరణాల విజృంభణ తో ప్రజారోగ్యం, మానసిక ఆరోగ్య సంక్షోభం ప్రమాదంలో పడ్డాయి.అనారోగ్య అలలు, ఆర్థిక సామాజిక కుదుపులు, అనిశ్చిత పరిస్థితులు, ఏం జరుగుతుందో అనే భయాలతో నరులు నరకాన్ని అనుభవిస్తున్నారు.
ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అనారోగ్యంగా ఉన్నానని, అనారోగ్యం కలుగవచ్చనే అనవసర భయం గుప్పిట్లో చిక్కుకొని వర్రీడ్ వెల్ సిండ్రోమ్ అనే మానసిక రుగ్మతతో సతమతం అవుతున్నాం.రోజు రోజుకు ఈ భయం పెరగడమే గమనించబడింది.
ఆరోగ్యం పట్ల మానసికంగా అతిగా ఆలోచించడం, అనుమానాలతో బతకడం, అతి జాగ్రత్తలతో ఆందోళనలకు గురి కావడం, అనారోగ్యంగా ఉన్నామని భయపడడం, అనారోగ్యం కలిగే అవకాశం ఉందని అనుక్షణం భీతిల్లడం లాంటి మానసిక రుగ్మతలు కలిగిన వర్రీడ్ వెల్ సిండ్రోమ్ బాధితులు ఆరోగ్యంగా ఉంటూనే రోగులుగా జీవనం గడపడం జరుగుతున్నది.ఇలాంటి అనుమాన పక్షుల సంఖ్య కోవిడ్-19 కల్లోలంలో అనేక రెట్లు పెరగడం ప్రాణాంతకంగా మారడం చూసాం.

వర్రీడ్ వెల్ సిండ్రోమ్ వలలో చిక్కిన వ్యక్తుల్లో ఆందోళన రుగ్మత , భయ రుగ్మత (పానిక్ డిసార్డర్), మానసిక ఒత్తిడి, నిరాశ, సొమాటిక్ రుగ్మత లాంటివి అధికం అవుతాయి.ఇలాంటి మానసిక రుగ్మతలు కలిగిన రోగుల తలలోనే తంటాల అనవసర ఆలోచనలు ఉన్నాయని నిపుణులు మానసిక ధైర్యం పెంచడానికి, అతి అనర్థదాయక ఆలోచనలను తగ్గించడానికి ప్రయత్నిస్తారు.వర్రీడ్ వెల్ రుగ్మత కలిగిన రోగులకు హైపోకాండ్రియాసిస్ అనబడే ఆరోగ్య ఆందోళన (హెల్‌త ఆగై్జటీ)కు గురి అయినట్లు నిర్ణయిస్తారు.1980ల్లో హెచ్‌ఐవి-ఏయిడ్‌స వ్యాప్తి సమయంలో, 2001లో ఆంత్రాక్‌స విస్తరణ రోజుల్లో, 2014లో ఎబోలా వ్యాధి ప్రబలిన వేళల్లో, మార్చి 2020 తరువాత కరోనా మహమ్మారి విజృంభƒణ కారణంగా ప్రపంచ మానవాళిలో అధికులు వర్రీడ్ వెల్ సిండ్రోమ్‌తో అనారోగ్యాల పాలు కావడం గమనించబడింది.వర్రీడ్ వెల్ సిండ్రోమ్ వలలో చిక్కిన మానసిక రోగాలను గుర్తించడం, చికిత్స చేయడం, రోగిలో మానసిక మార్పులు తీసుకురావడం అతి సున్నితమైన ప్రక్రియ అని నిపుణులు గుర్తిస్తారు.