కమెడియన్‌గా శ్రీనివాసరెడ్డి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.వందల కొద్ది సినిమాల్లో నటించిన ఆయన దర్శకుడిగా ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఆయనే ఈ సినిమాను కూడా నిర్మించాడు.దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా ఈ సినిమాను చేసిన శ్రీనివాస రెడ్డి ప్రేక్షకులను మెప్పించాడా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, సత్యలు స్నేహితులు.వీరు ముగ్గురు ఉద్యోగాల కోసం నానా కష్టాలు పడుతూ ఉంటారు.
వీరు ఏం చేసినా కూడా కలిసి రాదు.కెరీర్‌లో సెటిల్ అయ్యేందుకు కష్టపడుతున్న ఈ ముగ్గురు అనూహ్యంగా ఒక కేసులో చికుక్కుంటారు.
ఆ కేసుతో వీరి జీవితం మొత్తం మారిపోతుంది.ఇంతకు ఆ కేసు ఏంటీ? ఇందులో హీరోయిన్ పాత్ర ఏంటీ అనేది సినిమాను చూసి తెలుసుకోండి.
నటీనటుల నటన :
శ్రీనివాస రెడ్డి హీరోగా ఇప్పటికే నిరూపించుకున్నాడు.తాజాగా మరోసారి ఈయన మెప్పించాడు.
ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన టైమింగ్‌తో నవ్వించాడు.ఇక సత్య మరియు షకలక శంకర్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈతరం కమెడియన్స్‌లో వీరిద్దరు స్టార్స్ అని ఇప్పటికే గుర్తింపు దక్కించుకున్నారు.వారికున్న పేరును నిలుపుకుంటూ మంచి నటనతో నవ్వించారు.
సుమన్ శెట్టి మరియు వెన్నెల కిషోర్‌ల కామెడీ ఆకట్టుకుంది.సినిమాలో ఉన్న ప్రతి కమెడియన్ కూడా నవ్వించే ప్రయత్నం చేశారు.
హీరోయిన్‌కు పెద్దగా నటించే స్కోప్ లేదు.అయినా ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది.
టెక్నికల్ :
సాకేత్ కౌమాండూరి ఇచ్చిన సంగీతం సినిమాకు పెద్దగా ప్లస్ అవ్వలేదు.ఆయన పాటలు అన్ని కూడా సో సో గానే ఉన్నాయి.ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకుంది.ముఖ్యంగా సీన్స్ అన్ని కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మెప్పించాయి.సినిమాటోగ్రఫీ చాలా నాచురల్‌గా సీన్స్‌ను కనిపించేలా చేసింది.తక్కువ బడ్జెట్ అయినా సినిమాటోగ్రఫీతో మ్యానేజ్ చేసి మంచి రిచ్ లుక్‌ను తీసుకు వచ్చారు.
దర్శకుడు శ్రీనివాసరెడ్డి కథను ఆకట్టుకునే విధంగా నడించాడు.స్క్రీన్‌ప్లే విషయంలో మంచి పట్టుతో కనిపించింది.ఇక నిర్మాణాత్మక విలువలు యావరేజ్‌గా కథానుసారంగా ఉన్నాయి.
విశ్లేషణ :
నటుడిగా ఎన్నో మంచి పాత్రలు చేసిన శ్రీనివాసరెడ్డి హీరోగా ఇప్పటికే మెప్పించాడు.ఈసారి దర్శకుడిగా నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దం అయ్యాడు.ఆయన అనుకున్నట్లుగానే ఈ సినిమాను పూర్తి స్థాయి కామెడీతో నింపేశాడు.ఆరోగ్యకరమైన ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాకు తప్పకుండా మంచి ఆధరణ ఉంటుంది.కథ ఎలా ఉంది, చిన్న నటీనటులా, చిన్న బడ్జెటా అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా జనాలు ఇలాంటి సినిమాలను ఆధరిస్తారు.
కామెడీ కోసం సినిమా చూసే వారికి ఇదో మంచి ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.వెన్నెల కిషోర్ నుండి సుమన్ శెట్టి వరకు అంతా కూడా సినిమాలో మంచి కామెడీతో ఆకట్టుకున్నారు.
ప్లస్ పాయింట్స్ :
కామెడీ, కథలోని కొన్ని ట్విస్ట్‌లు
మైనస్ పాయింట్స్ :
ఎడిటింగ్, సాంగ్స్, హీరో హీరోయిన్ మద్య రొమాన్స్ లేకపోవడం, కామెడీ తప్ప ఇతర కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు.
బోటమ్ లైన్ :
భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు అందరిని కాకున్నా కొందరినైనా నవ్విస్తుంది.