నందమూరి కుటుంబంలో తారకరత్న ఒకరు.ఈయన హీరోగా కూడా పలు సినిమాలు చేసాడు.
ఒకటి అరా సినిమాలతో ఆకట్టు కున్నప్పటికీ హీరోగా కొనసాగలేక పోయాడు.అయితే ఈయన సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసి క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకు నచ్చిన పాత్రలను చేస్తూ వస్తున్నాడు.
నటుడిగా కొనసాగుతూనే ఏపీ రాజకీయాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నాడు.
తమ సొంత పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలోనే తారకరత్న కొనసాగు తున్నాడు.
ఇదిలా ఉండగా ఈ రోజు టాలీవుడ్ లో పలు ఊహించని వార్తలు వినిపిస్తున్నాయి.పలువురి మరణం దిగ్బ్రాంతికి గురి చేస్తుంది.
అలాగే నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు అనే వార్త కూడా తెలుగు ప్రజలకు షాక్ ఇచ్చింది.ఈ రోజు ఏపీ లో తెలుగుదేశం అధ్యక్షుడు నారా లోకేష్ పాదయాత్రలో ఈ విషాదం చోటు చేసుకుంది.
![Telugu Balakrishna, Bangalore, Jr Ntr, Nandamuritaraka, Lokesh, Padayatra, Tarak Telugu Balakrishna, Bangalore, Jr Ntr, Nandamuritaraka, Lokesh, Padayatra, Tarak](https://telugustop.com/wp-content/uploads/2023/01/Balakrishna-says-Taraka-Ratna-shifted-to-Bangalore-detailsa.jpg)
నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా తారకరత్న కూడా పాల్గొన్నారు.ఈ పాదయాత్రలో భారీ అభిమానులు, పార్టీ సభ్యులు తరలి వచ్చారు.వీరి భారీ మోహరింపు కారణంగా తారకరత్న తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.భారీగా అభిమానులు చుట్టు ముట్టడంతో తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు.దీంతో ఈయనను వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది.
![Telugu Balakrishna, Bangalore, Jr Ntr, Nandamuritaraka, Lokesh, Padayatra, Tarak Telugu Balakrishna, Bangalore, Jr Ntr, Nandamuritaraka, Lokesh, Padayatra, Tarak](https://telugustop.com/wp-content/uploads/2023/01/Balakrishna-says-Taraka-Ratna-shifted-to-Bangalore-detailss.jpg)
ఈ విషయంపై ఎన్టీఆర్ కూడా కాల్ చేసి కనుక్కున్నారని తెలిసింది.మరి ఈ ఘటనపై తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా స్పందించారు.ఈయన మాట్లాడుతూ అందరి ఆశీస్సుల వల్ల ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం బాగానే ఉందని.
మెరుగైన వైద్యం కోసం బెంగుళూరికి అంబులెన్స్ లో తరలిస్తున్నట్టు బాలకృష్ణ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.