సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ అయినప్పటి నుంచి నెటిజన్లు సోషల్ మీడియాను బాగా వాడుతున్నారు.ఇక సెలెబ్రేటీలు సైతం సోషల్ మీడియాకు బాగా అలవాటు పడుతున్నారు.
ఇక మీమర్స్ మాత్రం తెగ మీమ్స్ తో సందడి చేస్తున్నారు.ముఖ్యంగా సెలబ్రెటీలతో బాగా ఆడుకుంటున్నారు అని చెప్పవచ్చు.
ఏదైనా సినిమాలో నటీనటులకు సంబంధించిన సీరియస్ సన్నివేశాలు ఉంటే వెంటనే వాటికి మీమ్స్ క్రియేట్ చేసి నెట్టింట్లో తెగ వైరల్ గా మారుస్తున్నారు.అంతేకాకుండా డైలాగ్స్ ను కూడా ఫన్నీ గా క్రియేట్ చేసి బాగా ఎడిట్ చేస్తుంటారు.
ఇప్పటికే చాలామంది హీరో హీరోయిన్ లను బాగా ట్రోల్ చేశారు.స్టార్ హీరోలను కూడా అసలు వదలట్లేరు.
ఇదిలా ఉంటే తాజాగా ఓ సినిమా పోస్టర్ పై తెగ ట్రోల్స్, మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.ఇంతకీ అసలు విషయం ఏంటంటే.
టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో విజయ్ దేవరకొండ.ప్రస్తుతం ఈయన ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నాడు.
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.ఈ సినిమాతోనే ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నాడు.ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా సక్సెస్ లతో పాటు ఫ్లాపులను కూడా ఎదుర్కొన్నాడు.ఇక ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా రూపొందుతుండగా.
ఈ సినిమాపై ప్రేక్షకుల నుండి భారీ అంచనాలే వెలువడుతున్నాయి.ఇక ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలో విడుదల కానుంది.
ఇదంతా పక్కన పెడితే ఇండస్ట్రీలో తాజాగా ఈ సినిమా నుండి ఒక లుక్ విడుదలైన సంగతి తెలిసిందే.అందులో విజయ్ లుక్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు.ఎందుకంటే అందులో ఆయన పీకే మాదిరిగా నగ్నంగా ఉండగా అందరూ ఆ ఫోటోని చూసి బాగా ట్రోల్స్ చేస్తున్నారు.మరి కొందరు మీమ్స్ క్రియేట్ చేసి బాగా వైరల్ గా మారుస్తున్నారు.
ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మాత్రం ఆయన ఫోటోకు లైకులు కొడుతున్నారు.మొత్తానికి విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం భారీ సాహసం చేశాడని ఈ ఫోటోతో అర్థం అవుతుంది.
కొందరు ఈ ఫోటోని చూసి డేరింగ్ స్టెప్ అంటే మరికొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.మీమర్స్ ఏకంగా బాలయ్యనే మధ్యలోకి లాగారు.
ఆ ఫోటోలో విజయ్ దేవరకొండ నగ్నంగా ఉండటంతో బాలయ్య శాలువా కప్పి మొత్తం కవర్ చేసినట్లుగా చూపించారు.ఇక ఆ ఫోటోని ప్రతి ఒక్కరు బాగా నవ్వుకుంటున్నారు.
అంతేకాకుండా సంపూర్ణేష్ బాబు ఫోటోతో విజయ్ దేవరకొండ ఫోటో ట్యాగ్ చేసి తెగ కామెంట్లు పెడుతున్నారు.