స్టార్ హీరో బాలకృష్ణ( Balakrishna ) తన సినీ కెరీర్ లో 100కు పైగా సినిమాలలో నటించారు.బాలయ్య గత మూడు సినిమాలు అంచనాలను మించి విజయం సాధించాయి.
సేవా కార్యక్రమాల విషయంలో సైతం బాలయ్య ముందువరసలో ఉంటారు.హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య రెండు రోజుల క్రితం సైతం ఒక బాలుడి కోసం 25,000 రూపాయల సహాయం చేశారు.
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి( Basavatarakam Cancer Hospital ) ద్వారా బాలయ్య ప్రజలకు మెరుగైన వైద్యం లభించేలా చేస్తున్నారు.
అదే సమయంలో కొంతమంది నిరుపేదలకు బాలయ్య ఈ ఆస్పత్రి ద్వారా వైద్య చికిత్సలు అందేలా చూస్తున్నారు.
అయితే బాలయ్యకు ఇప్పటివరకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ రాలేదనే సంగతి తెలిసిందే.బాలయ్య పద్మభూషణ్,( Padma Bhushan ) పద్మవిభూషణ్ లకు అర్హుడు కాదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బాలయ్య ఫ్యాన్స్ ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇతరులతో పోలిక అవసరం లేదు కానీ ఇండస్ట్రీ కోసం బాలయ్య పడిన కష్టం అంతాఇంతా కాదు.బాలయ్య తను చేసిన సహాయాలను చెప్పుకోవడానికి సైతం ఇష్టపడరు.బాలయ్యకు భవిష్యత్తులో అయినా పద్మ పురస్కారాన్ని ప్రకటిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉన్నాయి.
బాలయ్య పద్మ పురస్కారాలకు అర్హుడని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం బాబీ( Director Bobby ) సినిమాలో నటిస్తున్న బాలయ్య పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ కథాంశంలో నటిస్తున్నారు.డైరెక్టర్ల హీరోగా పేరు తెచ్చుకున్న బాలయ్య జయాపజయాలకు అతీతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.చిన్న హీరోలను ప్రోత్సహించే విషయంలో బాలయ్య ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.
బాలయ్య బాబీ కాంబో మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ అయిందని త్వరలోనే ఆ టైటిల్ కు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.ఈ సినిమా బడ్జెట్ విషయంలో సితార నిర్మాతలు ఏ మాత్రం రాజీ పడటం లేదని భోగట్టా.