టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో శ్రీలీల( Sreeleela ) ఒకరు కాగా శ్రీలీలకు ఈ మధ్య కాలంలో లక్ అస్సలు కలిసిరావడం లేదనే సంగతి తెలిసిందే.ఆమె నటించి ఇటీవల విడుదలైన రాబిన్ హుడ్ సినిమా( Robinhood Movie ) బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఈ నటికి చేదు అనుభవం ఎదురైంది.శ్రీలీల చేయి పట్టి ఫ్యాన్స్ మిస్ బిహేవ్ చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.
ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్( Kartik Aryan ) కు జోడీగా ఒక సినిమాలో ఈ బ్యూటీ నటిస్తున్నారు.శ్రీలీల ప్రస్తుతం నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ డార్జిలింగ్ లో నిన్నటి వరకు జరిగింది.
ఒక ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి కార్తీక్, శ్రీలీల నడిచి వెళ్తుండగా కొంతమంది ఫ్యాన్స్ ఆమెను చేయి పట్టుకుని లాగారు.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా శ్రీలీల అభిమానులు ఈ విషయంలో ఫీలవుతున్నారు.

శ్రీలీల పారితోషికం ఒకింత భారీ స్థాయిలోనే ఉందని సమాచారం అందుతోంది.శ్రీలీల తెలుగులో ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించినా వరుస ఫ్లాపులు ఈమెకు మైనస్ అయ్యాయని చెప్పవచ్చు.ఫ్యాన్స్ బిహేవియర్ ను కొంతమేర మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.శ్రీలీల రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

శ్రీలీల కార్తీక్ ఆర్యన్ తో డేటింగ్ లో ఉన్నారని వార్తలు ప్రచారంలోకి రాగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.శ్రీలీల త్వరలో మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.శ్రీలీల క్రేజ్, రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతున్నాయి.శ్రీలీల కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.తెలుగులో టాప్ బ్యానర్లలో శ్రీలీలకు ఎక్కువగా మూవీ ఆఫర్లు వస్తుండటం గమనార్హం.