పబ్లిక్ పార్క్ లో స్నేహితురాళ్ల తో వర్కవుట్స్ చేస్తున్న కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డే పై దాడికి యత్నించినట్లు తెలుస్తుంది.తెలుగులో నాగార్జునతో మన్మథుడు 2, నిఖిల్‌తో కిర్రాక్ పార్టీ వంటి చిత్రాలతో పాటు పలు తమిళ చిత్రాల్లో నటించిన హీరోయిన్ సంయుక్త హగ్డే.
ఈమె బెంగళూరులోని ఓ పార్కులో స్పోర్ట్స్ బ్రా వేసుకుని పార్కులో డాన్స్, వర్కవుట్స్ చేయడానికి కొంత మంది స్నేహితులతో కలిసి చేరుకున్నారు.ఆ సమయంలో అక్కడున్నన కవితా రెడ్డి మహిళ సంయుక్తపై దాడి చేసింది.
సదరు దాడి చేసిన మహిళకు అక్కడే ఉన్న కొంత మంది పబ్లిక్ కూడా సపోర్ట్ చేశారు.పబ్లిక్‌లో స్పోర్ట్స్ బ్రా వేసుకుని తిరగడంతో పాటు మీ ఆర్టిస్టులందరూ డ్రగ్స్ వాడుతారంటూ సంయుక్త హెగ్డేపై దాడి జరిగింది.
ఈ ఘటనపై షాక్‌కు గురైన సంయుక్త.ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జరిగిన విషయాన్ని తెలియజేశారు.
సామాజిక కార్యకర్తలం అంటూ పదిమంది యువకులు దాడి చేశారు.బెంగళూరులోని పబ్లిక్ పార్క్‌లో స్నేహితురాలితో కలిసి వర్కవుట్స్ చేస్తున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది.
ప్రతి రోజు పార్క్‌లో వర్కవుట్స్ చేస్తున్న సంయుక్తపై ఎవరో ఫిర్యాదు చేయడంతో ఆ యువకులు వచ్చినట్టు సమాచారం.
సంయుక్తపై దాడి చేసే క్రమంలో పోలీసులు రంగ ప్రవేశంతో చేయడంతో ఆమె క్షేమంగా బయటపడింది.
అయితే తనపై సామాజిక కార్యకర్తలం అంటూ దాడి చేయడానికి వచ్చిన వారిని వీడియో ద్వారా చూపించింది.స్పోర్ట్స్ బ్రా ధరించడం నేరమా, ఇదేనా ఇండియాలో ఉన్న మాకు ఉన్న స్వాతంత్ర్యం అంటూ ప్రశ్నించింది.