మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) తెలుగులో స్టార్ డం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.రంగస్థలం సినిమా చేసుంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ అనుపమ ఆ సినిమా ఛాన్స్ ఆఖరి నిమిషం లో మిస్ అవడం ఆమె కెరీర్ మీద బాగా ఇంప్యాక్ట్ చూపించింది.
యువ హీరోలతో సినిమాలు చేస్తున్న అమ్మడు కెరీర్ హిట్ ఫ్లాపులతో కొనసాగిస్తుంది.లాస్ట్ ఇయర్ కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో హిట్ అందుకున్న అనుపమ ప్రస్తుతం రెండు క్రేజీ సినిమాలతో వస్తుంది.
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సూపర్ హిట్ మూవీ డీజే టిల్లుకి సీక్వల్ గా వస్తున్న టిల్లు స్క్వేర్ మూవీ( Tillu Square )లో అనుపమ నటిస్తుంది.ఈ సినిమా తర్వాత మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వస్తున్న ఈగల్( EAGLE ) సినిమాలో కూడా అనుపమ నటిస్తుంది.కచ్చితంగా ఈ రెండు సినిమాలు అనుపమ ఫేట్ మార్చబోతున్నాయని చెప్పొచ్చు.చాలామంది స్టార్ హీరోయిన్స్ రవితేజతో మొదలు పెట్టి ఆ తర్వాత స్టార్స్ తో జతకడుతుంటారు.అనుపమ నెక్స్ట్ స్టార్ ఛాన్స్ లు అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.రాబోయే రెండు సినిమాలు హిట్ పడితే మాత్రం అనుపమ నిజంగానే నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది.