20 ఏళ్లుగా పనిచేస్తున్న మహిళకు ఊహించని బోనస్.. కంటతడి పెట్టుకున్న ఉద్యోగిని..!

సాధారణంగా కొంతమంది ఉద్యోగులు ఒకే కంపెనీ కోసం ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తుంటారు.శాలరీ ఎంత ఇచ్చినా పట్టించుకోకుండా కంపెనీ వృద్ధిలో ఒక పిల్లర్ లాగా నిలుస్తుంటారు.

 An Unexpected Bonus For A Woman Who Has Been Working For 20 Years.. The Employee-TeluguStop.com

అయితే వీరి శ్రమను కొంతమంది యజమానులు మాత్రమే గుర్తిస్తారు.గుర్తించడమే కాకుండా వారికి ఊహించని రీతిలో బహుమతులు అందజేస్తారు.

లేదంటే ఆర్థిక సహాయం చేస్తారు.తాజాగా ఒక యజమాని 20 ఏళ్లుగా తన హాస్పిటల్‌( Hospital )లో డెంటిస్ట్ పనిచేస్తున్న ఒక మహిళకు చాలా డబ్బులను బోనస్‌గా అందించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

@PicturesFoIder ట్విట్టర్( Twitter ) పేజీ షేర్ చేసింది.ఆసుపత్రిలో 20 ఏళ్లుగా పని చేస్తున్న డెంటిస్ట్ 20,000ల డాలర్లను బోనస్‌గా పొందింది అని దీనికి ఒక క్యాప్షన్ జోడించారు.20వేల డాలర్లు అంటే మన డబ్బుల్లో రూ.16 లక్షల పైమాటే.ఒక డెంటిస్ట్( Dentist ) కి ఇంత బోనస్ ఇవ్వడం చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు.

అందుకే ఆ మహిళ కంటతడి పెట్టుకుంది.ఈ ఆసుపత్రి బాస్ ఆమెకు డాలర్స్ ఒక్కొక్కటిగా ఇస్తూ ఆమె ఆనందాన్ని మరింత రెట్టింపు చేశారు.

ఆమె తన ఆనందభాష్పాలను ఆపుకోలేకపోయింది. తోటి ఉద్యోగులు ఆమెను చూస్తూ ఎమోషనల్ కి గురయ్యారు.

హాస్పిటల్ ఓనర్స్ చప్పట్లు కొడుతూ ఆమె చేసిన కృషికి ధన్యవాదాలు తెలిపారు.అప్పటిదాకా ఆమె ఎంతో కష్టపడి చివరికి ప్రతిఫలం పొందినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ దృశ్యాలు చూసేందుకు కట్టిపడేస్తున్నాయి.

ఈ హార్ట్ టచింగ్ వీడియోకి 2 కోట్ల 37 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.తమ ఓనర్లు చాలా స్వార్థపరులని, ఎన్ని ఏళ్ళు చేసినా ఇంత మొత్తంలో బోనస్ అస్సలు ఇవ్వరని, మంచి ఓనర్స్ పొందడం ఆమె అదృష్టమని కొందరు పేర్కొన్నారు.దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube