న్యూజిలాండ్ దేశంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ మేరకు ఆక్లాండ్ లో వేడుకల సందర్భంగా నిర్వహించిన లేజర్ షో దేశ ప్రజలను ఆకట్టుకుంది.
యావత్ ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే ముందుగా న్యూజిలాండ్ ప్రజలు కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పారు.ఈ క్రమంలోనే అంబరాన్ని అంటే సంబురాలతో కొత్త ఏడాది 2024కు న్యూజిలాండ్ ప్రజలు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ప్రజలంతా పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.అలాగే ఆక్లాండ్ లోని ప్రఖ్యాత స్కైటవర్ పై నిర్వహించిన లేజర్ షోను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.