ఐకాన్ స్టార్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) తెలుగు రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో అభిమానులను కలిగి ఉన్నారు.అల్లు అరవింద్( Allu Aravind ) నటుడిగా, నిర్మాతగా గుర్తింపును సంపాదించుకోగా బన్నీ తండ్రిని మించిన తనయుడిగా ఎదిగారు.
కెరీర్ తొలినాళ్లలో తండ్రి సపోర్ట్ తీసుకున్న బన్నీ తర్వాత రోజుల్లో సొంతంగా కెరీర్ విషయంలో ఎదిగే దిశగా అడుగులు వేశారు.ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ 2( Telugu Indian Idol 2 ) ఫినాలే ఎపిసోడ్ కు బన్నీ గెస్ట్ గా హాజరయ్యారు.
ఈ ప్రోగ్రామ్ ప్రోమోలో బన్నీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ప్రోమోలో సింగర్ల టాలెంట్ ను ప్రశంసించడంతో పాటు బన్నీ తన గర్ల్ ఫ్రెండ్ గురించి కూడా కామెంట్లు చేశారు.
అయితే ఆ గర్ల్ ఫ్రెండ్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మాత్రం ఫుల్ ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.ప్రోమోలో థమన్ డౌన్ డౌన్ డౌన్ డుప్పా సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేశారు.
![Telugu Allu Arjun, Allu Arvind, Icon Allu Arjun, Pushpa, Teluguindian, Thaman-Mo Telugu Allu Arjun, Allu Arvind, Icon Allu Arjun, Pushpa, Teluguindian, Thaman-Mo](https://telugustop.com/wp-content/uploads/2023/05/allu-arjun-comments-about-allu-arvind-detailsd.jpg)
ఆ స్టెప్పులను చూసిన బన్నీ పుష్ప2 సినిమాకు థమన్ ఎలాగో మ్యూజిక్ చేయడం లేదని అందువల్ల ఆ సినిమాకు థమన్ కొరియోగ్రఫీ చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.అల్లు అర్జున్ కు సాంగ్స్ కంపోజ్ చేయాలంటే రెండు మూడు కీబోర్డ్ లను విరగ్గొడతానని థమన్ చెప్పగా డ్రమ్ములు చిరగ్గొడుతున్నావట వేరే సినిమాలకు అంటూ అఖండ సినిమాకు థమన్ పనితనం గురించి బన్నీ ప్రశంసించారు.
![Telugu Allu Arjun, Allu Arvind, Icon Allu Arjun, Pushpa, Teluguindian, Thaman-Mo Telugu Allu Arjun, Allu Arvind, Icon Allu Arjun, Pushpa, Teluguindian, Thaman-Mo](https://telugustop.com/wp-content/uploads/2023/05/allu-arjun-comments-about-allu-arvind-detailss.jpg)
మీ చెయ్యి చాలా మంచిదని విన్నానని మా పాపకు బ్లెస్ చేయాలని ఒక సింగర్ కోరగా ఆ చిన్నారిని బన్నీ ఆశీర్వదించారు.నేను మా ఫాదర్ గురించి ఒక్క లైన్ లో చెబుతానని నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదని నాకు కనిపించే అన్నీ ఇచ్చిన దేవుడు నాన్న అని బన్నీ అన్నారు.త్వరలో ఈ ఎపిసోడ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.