ఎవరికైనా సినిమా అవకాశం లభించింది అంటే టాలెంట్ తో పాటు కొద్దో గొప్పో అదృష్టం ఉండాలి.కానీ ఒక్క సినిమా పోయిన కూడా ఇక వారి పని అయిపోయినట్టే అనుకుంటూ ఉంటారు.
కానీ అన్ని రకాల సెంటిమెంట్స్ కి భిన్నమైన హీరో ఆది సాయి కుమార్.పుష్కర కాలం క్రితం ఇండస్ట్రీ కి పరిచయం అయిన ఆది కి నేటి వరకు చెప్పుకోదగ్గ ఒక్క హిట్ కూడా లేదు.
అయిన కూడా ఆయన సినిమాల దండయాత్ర మాత్రం ఆగడం లేదు.మీ సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటి అంతే ఆది కూడ తడుముకోకుండా సమాధానం చెప్పలేడు.
అయితే 2022 మాత్రం ఆదికి బాగా గుర్తుంది పోతుంది.
గత 11 ఏళ్లలో దాదాపు గా 14 సినిమాలు తీసిన ఆది ఈ ఒక్క 2022 లోనే 8 కొత్త సినిమాలకు శ్రీకారం చుట్టాడు.
అందులో 5 సినిమాలు విడుదల అయ్యాయి.ఇంకో 3 రిలీజ్ కి సిద్దం అవుతున్నాయి.ఇవి కాక మరి కొన్ని కథలను ఓకే చెప్పడంతో అవి కూడా రకరకాల స్టేజెస్ లో వర్క్స్ జరుగుతున్నాయి.
ఇక ఈ ఏడాది ఆది నటించి విడుదల చేసిన 5 సినిమాల్లో ఐదు(బ్లాక్, తీస్ మార్ ఖాన్, టాప్ గేర్, క్రేజీ ఫెల్లో, అతిధి దేవోభవ) కూడా ఫ్లాప్ అయ్యాయి అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.ఎందుకంటే అస్సలు కెరీర్ మొత్తం మీద ఒక్క హిట్ కూడా లేని ఆది ఇప్పుడు విజయం సాధించక పోవడం పెద్ద విషయం ఏమీ కాదు.
అయితే ఆది ఇలా వరస ఫ్లాప్ తెచ్చుకుంటున్న కూడా శపగ్రస్తుడు అనుకోవడానికి వీలులేదు.ఎందుకంటే అతడు నిజంగా లక్కీ ఫెలో.ఎన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్న మళ్ళీ కొత్త సినిమాల్లో నటించమంటు అడ్వాన్సులు ఇస్తున్న నిర్మాతలు ఉండనే ఉన్నారు.
ఇలా ఆది కి వరస అవకాశాలు దక్కడం పట్ల ఇండస్ట్రీ మొత్తం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు.అంతలా ఆది లో ఏం నచ్చిందో అర్దం కాని పరిస్థితి.
పోనీ సినిమా ఫ్లాప్ అయిన బ్రహ్మండం బద్దలయ్యే నటన లేదా నటించిన సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే అది లేదు.ఏంటో మరి ఈ అది సాయి కుమార్ సినిమాల ఫ్లాపుల రహస్యం.