హర్యానాలోని యమునా నగర్ లో డీజిల్ చోరీ చేస్తున్న వ్యక్తులకు దేహశుద్ది చేశారు గ్రామస్తులు.నిలిపి ఉంచిన వాహనాలలో డీజిల్ మాయం కావడాన్ని గుర్తించిన స్థానికులు నిఘా పెట్టారు.
ఈ క్రమంలోనే డీజిల్ చోరీకి వచ్చిన ఇద్దరు వ్యక్తులను గ్రామస్తులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.అనంతరం వారికి దేహశుద్ధి చేసి చెప్పుల దండను మెడలో వేసి ఊరేగించారు.
అనంతరం లారీకి కట్టేసి మరోసారి చితకబాదారు.తరచూ డీజిల్ దొంగతనం చేయడంతో పాటు బ్యాటరీలు కూడా అపహరించి అమ్ముకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.