కేంద్రంలో ఇప్పటికే రెండుసార్లు కొలువు తీరిన బాజాపా ప్రభుత్వం( BJP party ) మరోసారి తమ సత్తా నిరూపించుకునేందుకు అన్ని అస్త్రాలనూ సమకూర్చుకుంటుంది.కాంగ్రెస్ పూర్తిస్థాయిలో పుంజుకోకపోవడం ప్రతిపక్షాల కూటమి కూడా దిశా నిర్దేశం లేకుండా సాగుతూ ఉండడం ఆ కూటమి లో ప్రధాన మంత్రి పదవి ఆశావహుల సంఖ్య పెరిగిపోతుండడంతో కూటమి ఐక్యత వట్టి డొల్లే అని తేలిపోయింది.
దాంతో మరోసారి భాజపా కేంద్రంలో చక్రం తిప్పే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.దానికి తోడు మహిళా రిజర్వేషన్ల బిల్లుని ఆమోదింపచేయడం కూడా ఆ పార్టీకి కలసి వచ్చే అవకాశం ఉంది . భాజపా తన సంప్రదాయ ఓటు బ్యాంకు నిలబెట్టుకోని ముందుకు వెళుతుందని వార్తలు వస్తున్నాయి.

అయితే రాష్ట్రాల వారి పలితాన్ని చూసుకుంటే భాజాపాకు అవకాశం ఉందని కొంత కాలం క్రితం వరకు అందరూ భావించిన తెలంగాణలో మాత్రం పరిస్థితులు పూర్తిగా చేయి జారిపోయినట్లుగా తెలుస్తుంది .ఇక్కడ కమలం వాడిపోయిందని ఇక్కడ పోటీ పూర్తిగా కాంగ్రెస్ వర్సెస్ బారాసాగా మారిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి.ముఖ్యంగా బండి సంజయ్ ( Bandi Sanjay Kumar )సారధ్యంలో కనీస పోటీ ఇస్తున్న స్థాయి నుంచి ఇప్పుడు ఆయనను తప్పించిన తర్వాత పూర్తిస్థాయిలో దశ దిశ లేకుండా నడుస్తున్న భాజపా తన ప్రభావాన్ని కోల్పోయింది.
ఇప్పుడు భాజాపాలోని కీలక నాయకులు, మాజీ ఎంపీలు హస్తం పార్టీ వైపు చూస్తున్నారని .కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు చేస్తున్నారని ,గట్టి హామీ కనక లభిస్తే భాజాపాకు జలక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది .

అధికార బారాసా ని ఓడించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్( Congress party ) వల్ల మాత్రమే జరుగుతుందని, బారతీయ రాష్ట్ర సమితి తో లాలూచీ పడ్డారు అన్న ప్రచారం ఊపందుకోవడం దానిని తెలంగాణలో మెజారిటీ ప్రజానీకం నమ్ముతుందన్న అంచనాల నడుమ భాజపాతో కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందిగా భావిస్తున్న ఈ నేతలు కాంగ్రెస్ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.మరి ఉన్న ఈ తక్కువ సమయం లో సార్వత్రిక ఎన్నికల వ్యూహాలలో నిమగ్నమైన కేంద్ర బాజాపా రాష్ట్రాల ఎన్నిక ల గురించి ఆలోచించే పరిస్థితి కూడా లేదు .దాంతో తెలంగాణ లో బజాపా ఎంత వేగం గా వికసించిందో అంతే వేగం గా వాడిపోయినట్లయింది
.