రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్( Prabhas ) తను చేసిన మొదటి సినిమా అయిన ఈశ్వర్ తోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఆ తర్వాత ఆయన చేసిన ప్రతి సినిమా కాకుండా ఆయనకి యంగ్ రెబల్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా తనకు వరుస గా సక్సెస్ లను కట్టబెట్టాయి.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన బాహుబలి( Baahubali ) సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్నాడు.
ఇక మొత్తానికైతే పాన్ ఇండియా స్టార్ గా ఎదగడమే కాకుండా ఇప్పుడు ఆయనను టచ్ చేసే పాన్ ఇండియా హీరో మరొకరు లేరు అనేంతలా పేరు ప్రఖ్యాతాలను సంపాదించుకున్నాడు.ఇక నిజానికి ప్రభాస్ లాంటి స్టార్ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి.ఇక ఇలాంటి ఒక నటుడు చేసే సినిమాలు వరుసగా మంచి విజయాలను సాధిస్తున్నాయి.
ఇక బాలీవుడ్ దిగ్గజాలుగా చెప్పుకునే ప్రభాస్ దూకుడు ముందు వాళ్ళందరూ వెనకడుగు వేయక తప్పట్లేదు.
అందుకే ప్రభాస్ లాంటి స్టార్ హీరో ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తు ముందుకు సాగుతున్నాడు.ఇక సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వస్తున్న స్పిరిట్ సిలోనిమా ప్రభాస్ విలన్ పాత్రలో కూడా నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో డ్యూయల్ పాత్రలో నటిస్తున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి.
ఇక అందులో ఒకటి విలన్ పాత్ర అని సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vang) ఒక ఇంటర్వ్యూలో హింట్ అయితే ఇచ్చాడు.ఇక కొత్తానికైతే ప్రభాస్ హీరోగా విలన్ గా ఎంతవరకు నటించి మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఈ సినిమాతో ప్రభాస్ భారీ సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది…
.