రెండు సంవత్సరాలుగా ఇదిగో మొదలు, అదిగో మొదలు అని సాగదీయడమే తప్ప, మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా మొదలైంది లేదు ఏమి లేదు.ఒక సంవత్సరం మొత్తం కథ, దర్శకుడు అంటూ సాగదీశారు.
కథ దొరికింది, కొత్తగా రాయాల్సిన అవసరం లేకుండా కత్తి సినిమా రీమేక్ కి ప్లాన్ వేశారు.దర్శకుడు కూడా దొరికేసాడు.
ఫామ్ తో సంబంధం లేకుండా వి.వి.వినాయక్ వైపు మొగ్గు చూపారు.మరి సినిమా ఇంకెప్పుడు మొదలవుతుంది ?
మార్చి 28న సినిమా మొదలు అన్నారు.ఇంకా నెలరోజులు మిగిలి ఉంది ముహూర్తానికి.మరో నెలరోజులు ఓపికపడితే చాలు కదా అని సంబరపడిపోకండి.ఈసారి కూడా సినిమా మొదలయ్యేది అనుమానమే అంట.
కారణాలు కరెక్ట్ గా తెలీదు కాని, మార్చిలో సినిమా మొదలయ్యే అవకాశాలు స్వల్పంగానే ఉన్నాయని మెగా సీనియర్ అభిమానుల నుంచి వచ్చిన సమాచారం.ఈసారి కుడా మొదలుపెట్టకుండా మళ్ళీ కొత్త తేది చెబితే మెగాఫ్యాన్స్ కూడా మెగాస్టార్ ని నమ్మడం మానేస్తారు.