చైనా: వామ్మో, రైతుపై విరుచుకుపడిన పెద్ద పులి.. వీడియో చూస్తే..

పులులు సామాన్యమైనవి కావు.అవి దేనికి భయపడవు.

 Video Of Chinese Farmer Avoiding Tiger Attack Goes Viral Details, Siberian Tiger-TeluguStop.com

ఎవరిపైనైనా దాడి చేయడానికి సిద్ధమవుతాయి.వాటి శక్తి ముందు మనుషులు ఏర్పరచుకున్న తలుపులు, గేట్లు కూడా తట్టుకోలేవు.

ఇవి గేట్లను ఒక్క పంచుతో ధ్వంసం చేస్తున్నాం వీడియోలు ఇంతకుముందు వైరల్ అయి ఆశ్చర్యపరిచాయి.అయితే ఇప్పుడు అలాంటి మరొక వీడియో వైరల్ గా( Viral Video ) మారింది.

అందులో ఒక రైతుకి హడల్ పుట్టించింది పులి.ఈ పులి చైనాలోని( China ) హీలాంగ్జియాంగ్ ప్రాంతంలో రైతుపై దాడికి యత్నించడం జరిగింది.

ఆ రైతుపై పులి( Tiger ) దాడి చేయడానికి ప్రయత్నించిన భయానక దృశ్యాలు సీసీటీవీలో క్యాప్చర్ అయ్యాయి.

ఈ ఘటనతో ప్రాంతం మొత్తం ఉలిక్కిపడిపోయింది.అధికారులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది.

కొద్దిసేపటికే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.అయితే ఈ రైతు ( Farmer ) గాయపడకుండా తప్పించుకున్నాడు కానీ దానికంటే కొద్ది గంటల ముందు పులి దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.

వారిలో 65 ఏళ్ల జావో అనే పశువుల రైతు తీవ్రంగా గాయపడ్డాడు.ఎడమ చేతికి తీవ్రమైన గాయాలు కావడం వల్ల ఆపరేషన్ చేయించుకున్నాడు.

ఆయన కుమారుడు స్థానిక రేడియో ఇంటర్వ్యూలో రెండు పులులు ఆ ప్రాంతంలో తిరుగుతున్నాయని చెప్పారు.అయితే అధికారులు ఇంకా ఎన్ని పులులు ఉన్నాయో, వాటిని పట్టుకున్నారో లేదో స్పష్టం చేయలేదు.

చైనాలోని బోలి కౌంటీలో సైబీరియన్ పులి( Siberian Tiger ) కనిపించడం ఇదే తొలిసారి.ఒక నిమిషం నిడివి గల వైరల్ వీడియోలో రైతు జాగ్రత్తగా రోడ్డు మీదకు వచ్చి పులిని వెతుకుతున్న దృశ్యం ఉంది.పులిని చూసి ఆయన వెంటనే పెద్ద ఇనుప గేటు వద్దకు పరుగు తీసి వెళ్లి దాన్ని మూసివేశాడు.ఆ పులి ఆ గేటును బలంగా తన్నడంతో అతను భయంతో వణికిపోయాడు.

అయితే స్థానిక ప్రభుత్వాలు ఎక్కడ పులి కనిపించినా, వాటి మల్ల విసర్జన లేదా అడుగుజాడలు కనిపించినా వెంటనే రిపోర్ట్ చేయాలని ప్రజలను కోరింది.పశువులకు కట్టుదిట్టమైన భద్రత అందించాల్సిందిగా రైతులకు సూచించారు.

సైబీరియన్ పులులు ఉదయం వేళ చాలా యాక్టివ్‌గా ఉంటాయి.ఇవి అంత సాధారణంగా దూకుడుగా ఉండవు.

వీటిని మనుషులు పెంచుకుంటారు కూడా.కానీ తెలియని వారి వాళ్ళ తమకు ఏదైనా ప్రమాదం ఉందనుకుంటే ఇవి వెంటనే చంపేస్తాయి.

చైనాలో ఇలాంటివి 70 దాకా ఉన్నట్టుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube