నల్లగొండ జిల్లా:జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ( Nagarjuna Sagar Project )కు ఎగువ నుండి వరద కొనసాగుతుండడంతో ప్రాజెక్ట్ అధికారులు బుధవారం 4 గేట్లు ఐదు అడుగుల మేర పైకెత్తి 32,400 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 76,555 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 76,555 క్యూసెక్కులుగా ఉంది.
ప్రస్తుత నీటి మట్టం(Current water level ) 590.00 అడుగులు కాగా పూర్తిస్థాయి నీటి మట్టం 590.00 అడుగులుగా ఉందని,ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 312.0450 టీఎంసీలుగా ఉందని, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలుగా ఉందని తెలిపారు.