భారీ సొరంగం.. సకల సౌకర్యాలు కూడా.. వీడియో వైరల్

లెబనాన్‌( Lebanon )లో హిజ్బుల్లా ఉపయోగించే సొరంగంలో ఒకదాన్ని ఇజ్రాయెల్ ( Israel )దళాలు కనుగొన్నాయి.ఈ వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రచురించింది.

హిజ్బుల్లా భూగర్భ సొరంగాలు హమాస్ సొరంగాల కంటే చాలా రెట్లు పెద్దవిగా ఉన్నాయి.ఈ వీడియోలో భారీ సొరంగంలో చాలా వస్తువులు ఉన్నాయి.

నీటి క్యాన్స్, ద్విచక్ర వాహనాలు ఇలా చాల వస్తువులు అక్కడ ఉన్నాయి.వాహనాలు కూడా ఈ సొరంగాల గుండా ప్రయాణించవచ్చు.

వీడియోలో, హిజ్బుల్లా రద్వాన్ కమాండోలు అక్కడ ఉన్నారని ఇజ్రాయెల్ తెలిపింది.వారి ప్రవేశాలు, నిష్క్రమణలు పౌర గృహాల ద్వారానే ఉంటాయని ఇజ్రాయెల్ వీడియోలో తెలిపింది.

హిజ్బుల్లా టన్నెల్స్‌( Hezbollah tunnel )లో ప్రైవేట్ గదులు, AK-47లు, బెడ్‌రూమ్‌లు, స్నానపు గదులు, నిల్వ చేసే ప్రదేశాలు, జనరేటర్లు కూడా ఉన్నాయి.మంగళవారం నాడు ఇజ్రాయెల్ సైన్యం తమ బలగాలు సొరంగాన్ని కనుగొన్నట్లు ప్రకటించింది.మరోవైపు, గాజా స్ట్రిప్‌ లోని హమాస్‌ పై ఇజ్రాయెల్ దాడి కొనసాగించింది.ఈ దాడుల్లో హమాస్ డ్రోన్ విభాగం అధిపతి మహమూద్ అల్-మహబూబ్ మరణించారు.ఐడీఎఫ్ బృందానికి 162వ డివిజన్ యొక్క దళాలు మహమూద్ అల్-మహబూబ్‌ను చంపాయి.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇది చూసిన సోషల్ మీడియా నెటిజన్లు.ఇవి మేము నివసిస్తున్న ఇళ్ల కంటే చాలా పెద్దగా ఉన్నాయంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.

ఈ మారణ హోమం ఇప్పటికైనా మారండి అంటూ మరికొందరు కోరుతున్నారు.నిజానికి ఈ దేశాలలో ఉగ్రవాదుల దృష్ట్యా ఇలా పెద్ద సంఖ్యలో బంకర్లు, భారీ సొరంగాలను ఏర్పాటు చేసుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube