భారీ సొరంగం.. సకల సౌకర్యాలు కూడా.. వీడియో వైరల్
TeluguStop.com
లెబనాన్( Lebanon )లో హిజ్బుల్లా ఉపయోగించే సొరంగంలో ఒకదాన్ని ఇజ్రాయెల్ ( Israel )దళాలు కనుగొన్నాయి.
ఈ వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రచురించింది.
హిజ్బుల్లా భూగర్భ సొరంగాలు హమాస్ సొరంగాల కంటే చాలా రెట్లు పెద్దవిగా ఉన్నాయి.
ఈ వీడియోలో భారీ సొరంగంలో చాలా వస్తువులు ఉన్నాయి.నీటి క్యాన్స్, ద్విచక్ర వాహనాలు ఇలా చాల వస్తువులు అక్కడ ఉన్నాయి.
వాహనాలు కూడా ఈ సొరంగాల గుండా ప్రయాణించవచ్చు.వీడియోలో, హిజ్బుల్లా రద్వాన్ కమాండోలు అక్కడ ఉన్నారని ఇజ్రాయెల్ తెలిపింది.
వారి ప్రవేశాలు, నిష్క్రమణలు పౌర గృహాల ద్వారానే ఉంటాయని ఇజ్రాయెల్ వీడియోలో తెలిపింది.
"""/" /
హిజ్బుల్లా టన్నెల్స్( Hezbollah Tunnel )లో ప్రైవేట్ గదులు, AK-47లు, బెడ్రూమ్లు, స్నానపు గదులు, నిల్వ చేసే ప్రదేశాలు, జనరేటర్లు కూడా ఉన్నాయి.
మంగళవారం నాడు ఇజ్రాయెల్ సైన్యం తమ బలగాలు సొరంగాన్ని కనుగొన్నట్లు ప్రకటించింది.మరోవైపు, గాజా స్ట్రిప్ లోని హమాస్ పై ఇజ్రాయెల్ దాడి కొనసాగించింది.
ఈ దాడుల్లో హమాస్ డ్రోన్ విభాగం అధిపతి మహమూద్ అల్-మహబూబ్ మరణించారు.ఐడీఎఫ్ బృందానికి 162వ డివిజన్ యొక్క దళాలు మహమూద్ అల్-మహబూబ్‌ను చంపాయి.
"""/" /
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇది చూసిన సోషల్ మీడియా నెటిజన్లు.ఇవి మేము నివసిస్తున్న ఇళ్ల కంటే చాలా పెద్దగా ఉన్నాయంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.
ఈ మారణ హోమం ఇప్పటికైనా మారండి అంటూ మరికొందరు కోరుతున్నారు.నిజానికి ఈ దేశాలలో ఉగ్రవాదుల దృష్ట్యా ఇలా పెద్ద సంఖ్యలో బంకర్లు, భారీ సొరంగాలను ఏర్పాటు చేసుకుంటారు.
మిస్ ఇండియా యూఎస్ఏగా చెన్నై భామ.. ఎవరీ కైట్లిన్ సాండ్రా?