ఇప్పుడున్న కాలంలో ప్రతి హీరో ఒక సినిమా తీస్తున్నాడు అంటే చాలా జాగ్రత్తగా తీసుకుంటారు ఏదైనా చిన్న రిస్కీ షాట్ ఉంది అంటే చాలు డూప్ తో మేనేజ్ చేస్తారు కానీ గతంలో అలా ఉండేది కాదు ఒక సినిమా అంటే ఫైట్లు పాటలు ఇలా ఎన్నో ఉంటాయి మామూలు సాంఘిక చిత్రాలైతే పర్వాలేదు గానీ జానపద పౌరాణిక సినిమాలైతే భయంకరమైన యుద్ధ సన్నివేశాలు కూడా ఉంటాయి దానికి ఎంతో మంచి ట్రైనింగ్ అవసరం ఉంటుంది అలా రిహార్సల్స్ చేయకుండా డైరెక్ట్ గా షూట్ చేసే పరిస్థితులు ఉండవు అలా చేస్తే కచ్చితంగా గాయాలు అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అందుకే దర్శకులు హీరోలు చాలా జాగ్రత్తగా ఎంతో కష్టపడి రోజుల తరబడి శ్రమించి వాటిపై పట్టు సాధించిన తర్వాతే షూటింగ్ కి వెళ్తారు.

అయితే విఠలాచార్య( B Vittalacharya ) దర్శకత్వం లో వచ్చిన లక్ష్మి కటాక్షం( Lakshmi Kataksham ) అనే సినిమా లో ఎన్టీఆర్ ఎలాంటి రిహార్సల్ లేకుండా డైరెక్ట్ గా షూట్ చేయడంతో పెద్ద గాయం జరిగింది దానివల్ల ఆ గాయానికి కారణమైన జగ్గయ్య భయంతో పారిపోయినంత పని చేశారు.వాస్తవానికి ఎన్టీఆర్ జగ్గయ్య మంచి స్నేహితులు ఎన్టీఆర్ ఉన్న ప్రతి సినిమాలో జగ్గయ్యను ఉండేలా ప్లాన్ చేసుకుంటారు అలాగే విఠలాచార్య తీసిన లక్ష్మీ కటాక్షం సినిమాలో కూడా చిన్నపాటి విలన్ పాటలు జగ్గయ్యకు అవకాశం ఇప్పించారు ఎన్టీఆర్.అయితే ఎన్టీఆర్ పై జగ్గయ్యకి కత్తి విసిరే ఒక సీన్ ఉంటుంది.
ఈ కత్తి తాకకుండా ఎన్టీఆర్ తప్పించుకుంటారు.కానీ ఆ కత్తి వెళ్లి అక్కడ ఉన్నా బొప్పాయి చెట్టుకు గుచ్చుకొని ఆ చెట్టు విరిగిపోవాలి.
అది సీన్ అందువల్ల ఎన్టీఆర్ కి ఎలాంటి ప్రమాదం లేదు కాబట్టి ఒక పదునైన కత్తిని తెప్పించారు దర్శకుడు.

కానీ దానికి షూట్ కి ముందే ఒక రిహార్సల్ చేద్దామన్న ఆలోచనలో జగ్గయ్య ( Jaggayya )ఉన్న సాయంత్రం అవ్వడంతో ఆ ఒక్క సీన్ తీస్తే అందరు ఇంటికి వెళ్లొచ్చనే తొందరలో ఉన్నారు కాబట్టి రిహార్సల్ వద్దు అని ఎన్టీఆర్ అన్నారట.రిహార్సల్ చేద్దాము అని చెప్పే ధైర్యం లేని జగ్గయ్య భయంతో వణుకుతూనే కత్తి విసిరారట.కానీ కత్తి వస్తున్న వేగాన్ని గమనించిన ఎన్టీఆర్ చేతులు అడ్డుపెట్టడంతో చేతులకు గట్టిగానే గాయాలయ్యాయి.
ఒక్కసారిగా యూనిట్ మొత్తం తలకిందులు అయినంత పని అయింది జగ్గయ్య చెమటతో తడిచిపోయారు.తాను చేసిన పొరపాటున క్షమించమని జగ్గయ్య ఎన్టీఆర్ నీ అడిగారట.అదేం పర్వాలేదు అంటూ ఎన్టీఆర్ వెన్ను తట్టారట.